ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేజీహెచ్‌ ట్రైబల్‌ సెల్‌ను డీఎంహెచ్‌వో తనిఖీ

ABN, Publish Date - Jul 13 , 2025 | 11:09 PM

విశాఖపట్నం కేజీహెచ్‌లో ట్రైబల్‌ సెల్‌ను ఆదివారం డీఎంహెచ్‌వో డాక్టర్‌.టి.విశ్వేశ్వరరావు నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు.

విశాఖ కేజీహెచ్‌ ట్రైబల్‌ సెల్‌లో రికార్డులు పరిశీలిస్తున్న అల్లూరి డీఎంహెచ్‌వో డాక్టర్‌.విశ్వేశ్వరరావు నాయుడు

గిరిజనులకు అందిస్తున్న సేవలపై ఆరా

రికారులను తనిఖీ చేసిన జిల్లా అధికారి

ట్రైబల్‌ సెల్‌ ఆధునికీకరణకు చర్యలు

అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్యాధికారి విశ్వేశ్వరరావు నాయుడు

పాడేరురూరల్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేజీహెచ్‌లో ట్రైబల్‌ సెల్‌ను ఆదివారం డీఎంహెచ్‌వో డాక్టర్‌.టి.విశ్వేశ్వరరావు నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత రోగులకు సంబంధించిన వివరాలు, అందిస్తున్న వైద్య సేవల రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఎం విశ్వేశ్వరరావునాయుడు మాట్లాడుతూ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పరిధిలో గిరిజన రోగులకు మెరుగైన వైద్య సేవలు కేజీహెచ్‌లో అందించడం జరుగుతుందన్నారు. ట్రైబల్‌ సెల్‌కు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు నిధులను వెచ్చిస్తూ గిరిజన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆస్పత్రిలో అందుబాటులో లేని పరీక్షలను ప్రైవేటు ల్యాబ్‌లలో చేయించడంతో పాటు అందుబాటులో లేని మందులను ప్రైవేటు షాపుల్లో కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నారన్నారు. వైద్యసేవలు పొందుతూ దురదృష్టవశాత్తు మృతి చెందితే గిరిజన రోగులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు మూడు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఇద్దరు డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారని, మరో డ్రైవర్‌ పోస్టును భర్తీ చేయాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌.శివానంద్‌ల ఆధ్వర్యంలో ట్రైబల్‌ సెల్‌ను ఆధునికీకరణ చర్యలు తీసుకుంటానన్నారు. ఇందుకోసం సిబ్బందికి కంప్యూటర్‌, అదనపు ఫర్నీచర్‌ను అందించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్‌ ట్రైబల్‌ సెల్‌ వైద్యాధికారి సంపత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 11:09 PM