ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గెడ్డ దాటి వెళ్లి పింఛన్ల పంపిణీ

ABN, Publish Date - Jun 01 , 2025 | 12:21 AM

మండలంలోని చింతలపూడి పంచాయతీలోని శివారు గ్రామాల్లో శనివారం పింఛన్లు పంపిణీ చేయడానికి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా మత్స్యశాఖ గ్రామ సహాయకుడు అబ్దుల్‌ రజాక్‌, ఉద్యాన వన శాఖ సహాయకుడు డి.వరుణ్‌కుమార్‌ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.

పింఛన్లు పంపిణీ చేయడానికి గెడ్డ దాటి వెళ్లిన సిబ్బంది

- చింతలపూడి పంచాయతీలోని శివారు గ్రామాల్లో పంపిణీకి సిబ్బంది కష్టాలు

దేవరాపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలపూడి పంచాయతీలోని శివారు గ్రామాల్లో శనివారం పింఛన్లు పంపిణీ చేయడానికి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా మత్స్యశాఖ గ్రామ సహాయకుడు అబ్దుల్‌ రజాక్‌, ఉద్యాన వన శాఖ సహాయకుడు డి.వరుణ్‌కుమార్‌ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ముందుగా దేవరాపల్లి నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించి బోడిగరువు, నేరెళ్లపూడి వెళ్లారు. అక్కడ నుంచి సమ్మెద గ్రామానికి రహదారి లేకపోవడంతో కాలినడకన ఐదు కిలోమీటర్లు వెళ్లారు. అక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటి ఆ గ్రామానికి వెళ్లి 21 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్థుడి సహాయంతో గెడ్డ దాటి ఇవతలి వైపునకు వచ్చారు.

Updated Date - Jun 01 , 2025 | 12:21 AM