మన్యంలో భిన్న వాతావరణం
ABN, Publish Date - Jul 30 , 2025 | 11:21 PM
మన్యంలో భిన్న వాతావరణం నెలకొంది. బుధవారం కాసేపు ఎండ, మరికాసేపు వర్షం కురిసింది. ఒడిశాను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, మిగిలిన మండలాల్లో మబ్బుల వాతావరణం ఏర్పడింది.
కాసేపు ఎండ, మరికాసేపు వర్షం
పాడేరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): మన్యంలో భిన్న వాతావరణం నెలకొంది. బుధవారం కాసేపు ఎండ, మరికాసేపు వర్షం కురిసింది. ఒడిశాను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, మిగిలిన మండలాల్లో మబ్బుల వాతావరణం ఏర్పడింది. జిల్లా కేంద్రం పాడేరుతో సహా అన్ని మండలాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. ఆకాశం మేఘావృతం కావడం, మధ్యలో ఒక్కసారిగా ఎండకాసి, ఆ తరువాత జల్లులు పడ్డాయి. వర్షాలు కాస్త తగ్గుముఖం పడుతుండడంతో వ్యవసాయ పనులు క్రమంగా జోరందుకుంటున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొయ్యూరులో 31.9 డిగ్రీలు
ముసురు కొనసాగుతున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు లేవు. బుధవారం కొయ్యూరులో 31.9, చింతపల్లిలో 29.0, అనంతగిరిలో 26.2, జి.మాడుగులలో 25.8, జీకేవీధిలో 24.7, పాడేరులో 24.0, హుకుంపేటలో 23.8, డుంబ్రిగుడ, అరకులోయలో 22.9, పెదబయలులో 22.4, ముంచంగిపుట్టులో 22.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సీలేరులో....
సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో వర్షం తగ్గుముఖం పట్టడం లేదు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విభిన్న వాతావరణం నెలకొంది. కాసేపు ఎండ, మరికాసేపు వర్షంతో జనం ఇబ్బంది పడ్డారు. కాగా ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో రవడంతో ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని గుంటవాడ జలాశయం వద్ద ఎత్తైన పచ్చని కొండలపై మంచు పరుచు కుని సుందర దృశ్యం ఆవిష్కృతమైంది.
Updated Date - Jul 30 , 2025 | 11:21 PM