నాబార్డు నిధులతో గ్రామీణ రోడ్ల అభివృద్ధి
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:32 AM
మండలంలో పలు గ్రామీణ రహదారుల అభివృద్ధికి మోక్షం కలిగింది. నాబార్డు నిధులు రూ.2.2 కోట్లతో మూడు ప్రధాన రహదారుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వాడచీపురుపల్లి నుంచి వెంకటాపురం వెళ్లే రహదారికి రూ.60 లక్షలు, కలపాక నుంచి గొల్లలపాలెం వెళ్లే రోడ్డుకు రూ.80 లక్షలు, స్వయంభూవరం నుంచి సోమినాయుడుపాలెం వెళ్లే ప్రధాన రహదారికి రూ.80 లక్షల చొప్పున నాబార్డు నిధులు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ ప్రాజెక్టు ఏఈ కుమార్‌రాజా శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
పరవాడ మండలంలో మూడు ప్రధాన రహదారులకు రూ.2.2 కోట్లు మంజూరు
నేడు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే పంచకర్ల
పరవాడ, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : మండలంలో పలు గ్రామీణ రహదారుల అభివృద్ధికి మోక్షం కలిగింది. నాబార్డు నిధులు రూ.2.2 కోట్లతో మూడు ప్రధాన రహదారుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వాడచీపురుపల్లి నుంచి వెంకటాపురం వెళ్లే రహదారికి రూ.60 లక్షలు, కలపాక నుంచి గొల్లలపాలెం వెళ్లే రోడ్డుకు రూ.80 లక్షలు, స్వయంభూవరం నుంచి సోమినాయుడుపాలెం వెళ్లే ప్రధాన రహదారికి రూ.80 లక్షల చొప్పున నాబార్డు నిధులు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ ప్రాజెక్టు ఏఈ కుమార్‌రాజా శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు శనివారం ఈ పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఈ రహదారుల దుస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’లో పలుమార్లు కథనాలు వెలువడడంతో స్పందించిన ఎమ్మెల్యే.. ఉన్నతాధికారులతో మాట్లాడి, నాబార్డు నుంచి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు.
Updated Date - Jul 26 , 2025 | 12:32 AM