ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శిథిల భవనంలో డిగ్రీ చదువులు

ABN, Publish Date - Jun 15 , 2025 | 11:18 PM

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల శిథిల భవనంలో కొనసాగుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం ఎప్పుడు శ్లాబ్‌ పెచ్చులు పడతాయో.. ఎప్పుడు భవనం కూలుతోందనన్న ఆందోళన విద్యార్థులు, అధ్యాపకుల్లో వ్యక్తమవుతోంది. అయినా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు స్పందించడం లేదు.

అరకులోయ డిగ్రీ కళాశాలలో వర్షానికి భవనం శ్లాబ్‌ పెచ్చులాడి పడిన దృశ్యం

భయం..భయంగా తరగతుల నిర్వహణ

ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన

రెండేళ్ల క్రితం విద్యార్థులు వారం రోజులపాటు దీక్షలు

స్పందించిన పాలకులు, కలెక్టర్‌, పీవో

డిగ్రీ కళాశాల సమస్యల పరిష్కారానికి హామీ

అయినా ఇంతవరకు అమలు కాని వైనం

అరకులోయ, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): అరకులోయ డిగ్రీ కళాశాల శిథిల భవనంలో నిర్వహిస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (టీటీసీ) కోసం నిర్మించిన భవనంలో డిగ్రీ కళాశాల తరగతులు జరుగుతున్నాయి. డిగ్రీ కళాశాలలో 9 గ్రూపుల్లో 1,100 మంది బాలబాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. డిగ్రీ కళాశాల ప్రారంభించిన మూడేళ్ల తర్వాత రూ. కోటిలో ఆరు గదులున్న భవాన్ని నిర్మించారు. ఆ భవనంలో ప్రిన్సిపాల్‌, ఆఫీస్‌ రూం, స్టాఫ్‌ రూం, కంప్యూటర్‌ ల్యాబ్‌, ఒకటి కంబైన్డ్‌ క్లాస్‌ రూం(డార్మటరీ రూం), ఇంగ్లీషు ల్యాబ్‌ ఉన్నాయి. ఇక ఈ భవనం పక్కనే టీచర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న గదులు చిన్నవి కావడంతో డిగ్రీ కళాశాల విద్యార్థులకు క్లాస్‌ రూంలుగా సరిపడడం లేదు. కొంతమంది విద్యార్థులు రూంలో ఉంటూ సగం మంది విద్యార్థులు బయట ద్వారబందం ముందు నేలపై కూర్చొని క్లాస్‌ వినాల్సిన దుస్థితి. ఈ భవనం శిథిలమై పోవడంతో వర్షాకాలంలో రూంలు లీకైపోతూ, శ్లాబ్‌పెచ్చులు ఊడిపడుతున్నాయి. గతంలో పలుమార్లు క్లాస్‌ జరుగుతుండగా విద్యార్థులపై శ్లాబ్‌పెచ్చులు ఊడిపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి కూడా. శ్లాబ్‌కు వేసిన ఐరన్‌ రాడ్‌లు కూడా బయటకు కనిపిస్తున్నాయి. వర్షాకాలం వస్తే తరగతుల గదుల్లో భయందోళనతో విద్యార్థులు, అధ్యాపకులు గడుపుతున్నారు. రెండేళ్ల క్రితం శిథిల భవనాల్లో చదువుకోలేమని, ఎప్పుడు ఏ విద్యార్థిపైన శ్లాబ్‌పెచ్చులు ఊడిపడతాయానంటూ ఆందోళన చెంది ఓ వారం పాటు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులంతా రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు స్పందించిన నాటి పాలకులు, కలెక్టర్‌, పీవో స్పందించి కళాశాలకు చేరుకొని విద్యార్థులు చెప్పిన సమస్యలను కళ్లారా చూసి తగు చర్యలు తీసుకుంటామని, కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడమే కాకుండా భవనాలకు మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. అయితే నాడు ఇచ్చిన ఏ ఒక్క హామీ నేటివరకు అమలు కాలేదు.. సరికదా నాటి కలెక్టర్‌, పాలకులు మారిపోయారు తప్ప కళాశాల భవనాల దుస్థితి మరింత దిగజారిపోయిందని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు డిగ్రీ కళాశాల గురించి పట్టించుకోలేదు. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కూడా దృష్టి సారించడం లేదు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఖర్చు చేస్తే ఈపాటికి డిగ్రీ కళాశాలకు భవనాలు సిద్ధమయ్యేవని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. రెండేళ్ల క్రితం విద్యార్థులు ఆందోళన చేసిన సమయంలో ఇచ్చిన హామీలను అయినా నెరవేర్చాలని ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం నాయకులు కోరుతున్నారు. ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కళాశాలను సందర్శించినప్పుడు విద్యార్థులు, ప్రిన్సిపాల్‌, సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. కనీసం శిథిలావస్థకు చేరిన భవనానికి మరమ్మతులు చేపట్టాలని కోరారు. లేకుంటే శిఽథిల భవనం స్థానంలో కళాశాలకు తగ్గట్టుగా క్లాస్‌రూంలు, ల్యాబ్‌లు ఉండే విధంగా నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయినా నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ సమస్యల పరిష్కారం మాత్రం కాలేదు. ఇప్పటికైనా అరకులోయ ఎంపీ, ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్‌ స్పందించి అరకులోయ డిగ్రీ కళాశాలకు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:18 PM