ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన్‌ కార్డుల ఈకేవైసీకి గడువు పెంపు

ABN, Publish Date - May 06 , 2025 | 12:33 AM

మన్యంలోని రేషన్‌కార్డుల లబ్ధిదారుల్లో ఈకేవైసీపై నెలకొన్న టెన్షన్‌ ఎట్టకేలకు తప్పింది. జూన్‌ 30 వరకు ఈకేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. వాస్తవానికి రేషన్‌ కార్డుల ఈకేవైసీ గడువు ఏప్రిల్‌ 30తో ముగిసింది.

ఈకేవైసీపై ‘ఆంధ్రజ్యోతి’ లో ప్రచురితమైన కథనం

జూన్‌ 30 వరకు అవకాశం

మన్యంలోని 66,966 మందికి లబ్ధి

పాడేరు, మే 5(ఆంధ్రజ్యోతి): మన్యంలోని రేషన్‌కార్డుల లబ్ధిదారుల్లో ఈకేవైసీపై నెలకొన్న టెన్షన్‌ ఎట్టకేలకు తప్పింది. జూన్‌ 30 వరకు ఈకేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. వాస్తవానికి రేషన్‌ కార్డుల ఈకేవైసీ గడువు ఏప్రిల్‌ 30తో ముగిసింది. కానీ జిల్లాలో ఇంకా 66,966 మందికి ఈకేవైసీ జరగకపోవడంతో లబ్థిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో గడువును పెంచడంతో వేలాది మంది లబ్ధిదారులకు ఊరట లభించింది.

జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లలోని 22 మండలాల పరిధిలో 671 రే షన్‌ డిపో పరిధిలో మొత్తం 2,98,092 రేషన్‌ కార్డులున్నాయి. వాటిలో మొత్తం 8,69,318 మంది లబ్ధిదారులకు గాను గడువు ముగిసే నాటికి 7,91,180 మందికే ఈకేవైసీ పూర్తయింది. దీంతో ఇంకా 66,966 మంది లబ్ధిదారుల ఈకేవైసీ పెండింగ్‌లో ఉంది. ఈకేవైసీ జరగకపోతే ఆ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రేషన్‌కార్డుల ఈకేవైసీ పెండింగ్‌ పరిస్థితి, లబ్ధిదారుల సమస్యపై ఈ నెల 3న ‘ఆంధ్రజ్యోతి’లో ఈకేవైసీ టెన్షన్‌’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడువును జూన్‌ 30 వరకు పెంచడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 06 , 2025 | 12:33 AM