ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రమాదకరంగా బురదగెడ్డ వంతెన

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:36 PM

అరకులోయ మండల పరిధిలోని యండపల్లివలస-అరకు మధ్య బురదగెడ్డ వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఒకవైపు అప్రోచ్‌రోడ్డుకు రంధ్రం పడింది. దాని కింద ఉన్న మట్టి కూడా కొట్టుకుపోయింది. దీంతో వంతెన వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఇక్కడ మట్టి వేసినా గెడ్డలోకి జారిపోతుంది తప్ప నిలవడం లేదు.

యండపల్లివలస-అరకు గ్రామం మధ్య బురదగెడ్డపై అప్రోచ్‌ రోడ్డు జారిపోయి ప్రమాదకరంగా ఉన్న దృశ్యం

వంతెనకు ఓ వైపు ఒరిగిన అప్రోచ్‌ రోడ్డు

మూన్నాళ్ల ముచ్చటగానే హైవే అధికారుల మరమ్మతులు

పనులు చేపట్టిన ఏడాదిలోనే మళ్లీ గోతులు

వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు

అరకులోయ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

అరకులోయ మండల పరిధిలోని యండపల్లివలస-అరకు మధ్య బురదగెడ్డ వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఒకవైపు అప్రోచ్‌రోడ్డుకు రంధ్రం పడింది. దాని కింద ఉన్న మట్టి కూడా కొట్టుకుపోయింది. దీంతో వంతెన వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఇక్కడ మట్టి వేసినా గెడ్డలోకి జారిపోతుంది తప్ప నిలవడం లేదు. అయినా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. మరిన్ని రోజులు ఇదే నిర్లక్ష్యం వహిస్తే సగం మేర రోడ్డు గెడ్డలోకి జారిపోయే ప్రమాదం ఉంది. వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే అరకులోయ పట్టణం నుంచి అల్లూరి సీతారామరాజు పబ్లిక్‌ స్కూల్‌ మధ్య ఉన్న వంతెన పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఓ వైపు వంతెన అప్రోచ్‌ పోయి పెద్ద రంధ్రం అయ్యింది. ఒకసారి వంతెన అప్రోచ్‌కు ఆనుకొని ఉన్న గోతిలో కారు ప్రమాదానికి గురైంది. ఈ రెండు వంతెనల వద్ద ప్రమాదకర పరిస్థితులున్నాయి. రానున్న వర్షాకాలంలో గెడ్డలు పొంగి ప్రవహిస్తే వంతెనలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి అప్రోచ్‌లను పటిష్టపరచాలని వాహనదారులు, పట్టణవాసులు, పర్యాటకులు డిమాండ్‌ చేస్తున్నారు.

తూతూమంత్రంగా రోడ్డు మరమ్మతులు

అరకు గ్రామం మొదలు అరకులోయ, పాణిరంగిని, గన్నెల జంక్షన్‌ నుంచి సుంకరమెట్ట-గాలికొండ, బీసుపురం, అనంతగిరి, బొర్రా జంక్షన్‌, డముకు, తైడా, కాశీపట్నం వరకు ఉన్న రహదారి గోతులమయమైంది. రహదారికి ఇరువైపులా మూడు అడుగుల లోతు మేర రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఈ గోతులన్నింటిని కవర్‌ చేస్తూ ఏడాది క్రితమే నేషనల్‌ హైవే అధికారులు మరమ్మతులు చేపట్టినా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. ప్రస్తుతం ఈ రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. గన్నెల జంక్షన్‌ సుంకరమెట్ట మధ్య, యండపల్లివలస-అరకు గ్రామం మధ్య, సుంకరమెట్ట- అనంతగిరి, బొర్రా జంక్షన్‌-డముకు- తైడా మధ్య ప్రధాన రహదారి ఎక్కడికక్కడ గోతులమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్‌అండ్‌బీ, హైవే పరిధిలో ఉన్న రహదారులను ఆయా శాఖల ఇంజనీరింగ్‌ అధికారులు తక్షణం స్పందించి మరమ్మతులు చేపట్టాలని పర్యాటకులు, ప్రయాణికులు, వాహన చోదకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:36 PM