ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాడైన గేట్లు.. పారని నీరు

ABN, Publish Date - Jun 23 , 2025 | 12:50 AM

మండలంలో సర్పా నది నుంచి పొలాలకు నీరు అందించే మాకవరపాలెం మెరక, పల్లపు కాలువల గేట్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఈ గేట్లుకు మరమ్మతులు చేయించలేదని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఖరీఫ్‌ వరినాట్లు మొదలయ్యేనాటికి గేట్లు బాగుచేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మెరక కాలువలో మరమ్మతులకు గురైన మెయిన్‌ గేటు

400 ఎకరాలకు నీరు సరిగా అందక అన్నదాతల ఇక్కట్లు

వైసీపీ హయాంలో ఒక్క ఏడాది కూడా నిర్వహణ పనులు చేపట్టని వైనం

ఇరిగేషన్‌ అధికారులు రూ.3 లక్షలతో ప్రతిపాదనలు

కూటమి ప్రభుత్వం అయినా గేట్లు బాగుచేయించాలని రైతుల వినతి

మాకవరపాలెం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో సర్పా నది నుంచి పొలాలకు నీరు అందించే మాకవరపాలెం మెరక, పల్లపు కాలువల గేట్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఈ గేట్లుకు మరమ్మతులు చేయించలేదని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఖరీఫ్‌ వరినాట్లు మొదలయ్యేనాటికి గేట్లు బాగుచేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మాకవరపాలెం సమీపంలో సర్పా నదిపై నిర్మించిన ఆనకట్ట కింద కొండలఅగ్రహారం, మాకవరపాలెం, తామరం, జి.కోడూరు గ్రామాల్లో సుమారు 500 ఎకరాల ఆయకట్టు వుంది. ఆనకట్ట నుంచి మెరక, పల్లం కాలువలు వున్నాయి. ఆనకట్ల ఆరంభంలో ఒక గేటు, కొంత దూరం వెళ్లిన తరువాత పొలాలకు నీరు అవసరం లేకప్పుడు కాలువలోకి వచ్చిన నీటిని తిరిగి నదిలోకి మళ్లించడాకి ఒక గేటు, దిగువున పల్లం కాలువపై ఒక గేటు వున్నాయి. చాలా ఏళ్ల నుంచి గేట్ల నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో కాలక్రమేణా బలహీనంగామారి పాడైపోయాయి. ప్రస్తుతం ఒక్క గేటు కూడా సరిగాలేదు. మొదటి గేటు ద్వారా నదిలో నుంచి కాలువలోకి వచ్చిన నీరు, రెండో గేటు ద్వారా తిరిగి నదిలోకి పోతున్నది. దీంతో పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. వైసీపీ అధికారంలో వున్నప్పుడు గేట్ల మరమ్మతులకు నిధుల కోసం జలవనరుల శాఖ అధికారులు ఏటా ప్రతిపాదనలు పంపడం, బుట్టదాఖలు కావడం ఆనవాయితీగా మారింది. గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి, కూటమి అధికారంలోకి రావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి ఖరీఫ్‌ పనులు ఆరంభం కావడంతో కాలువల గేట్లకు ఈ ఏడాది మరమ్మతులు చేస్తారని రైతులు భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నిరాశ చెందారు. ఉపాధి హామీ పథకం కింద కాలువలో తుప్పలు తొలగించడం సంతోషమేనని, కానీ గేట్లకు మరమ్మతులు చేయకపోవడం వల్ల పొలాలకు సాగునీరు రాదని రైతులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా నారుమడులు పోయడం పూర్తవుతుందని, వచ్చే నెలాఖరు నుంచి వరి నాట్లు వేస్తామని, ఈలోగా కాలువల గేట్లు బాగుచేయించాలని, లేకపోతే ఆయకట్టుకు నీరు అందక ఇబ్బంది పడతామని రైతులు వాపోతున్నారు. కాగా గేట్ల మరమ్మతులపై జలవనరుల శాఖ ఇన్‌చార్జి ఏఈ రాజేశ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, రెండు కాలువలపై ఉన్న మూడు గేట్ల మరమ్మతులకు రూ.3 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, ఆమోదం లభించిన వెంటనే పనులు చేయిస్తామని చెప్పారు.

వరి సాగుపై సందిగ్ధం

పంచదార్ల యేసుబాబు, మాకవరపాలెం (22ఎంకేపీ5)

మాకవరపాలెం మెరక కాలువ కింద నాకు రెండు ఎకరాల భూమి ఉంది. వరి సాగుకు కాలువ నీరే ఆధారం. కానీ చాలా ఏళ్ల నుంచి గేట్లకు నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో పాడైపోయాయి. దీంతో ఒక గేటు ద్వారా నదిలో నుంచి కాలువలోకి వచ్చిన నీరు, మరో గేటు నుంచి తిరిగి నదిలోకే పోతున్నది. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే వరి పంట పండుతుంది. లేదంటే పంట నష్టపోయినట్టే. అధికారులు స్పందించి ఖరీఫ్‌ వరినాట్లు వేసేలోగా గేట్లకు మరమ్మతులు చేయించాలి.

Updated Date - Jun 23 , 2025 | 12:50 AM