ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీతాఫలం ధర పతనం

ABN, Publish Date - Jul 30 , 2025 | 11:15 PM

సీతాఫలాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ ఽగిరిజన ప్రాంతంలో ధర పతనం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని డముకు వారపు సంతలో గత వారం క్రేట్‌ పండ్లు (సైజును బట్టి 70 నుంచి 100) రూ.700 ధర పలికింది. ఈ వారం క్రేట్‌ ధర రూ.300 నుంచి రూ.400 లోపు పలకడంతో రైతులు డీలా పడ్డారు.

కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్న రైతులు

గత వారం క్రేట్‌ పండ్ల ధర రూ.700

ఈ వారం రూ.300 నుంచి రూ.400 లోపు

డీలా పడిన రైతులు

వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో ఈ దుస్థితి

అనంతగిరి, జూలై 30(ఆంధ్రజ్యోతి): సీతాఫలాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ ఽగిరిజన ప్రాంతంలో ధర పతనం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని డముకు వారపు సంతలో గత వారం క్రేట్‌ పండ్లు (సైజును బట్టి 70 నుంచి 100) రూ.700 ధర పలికింది. ఈ వారం క్రేట్‌ ధర రూ.300 నుంచి రూ.400 లోపు పలకడంతో రైతులు డీలా పడ్డారు.

సీతాఫలం సీజన్‌ ప్రారంభమై నాలుగో వారం కావస్తుండగా, మూడు వారాలు ధర బాగానే ఉన్నప్పటికీ ఈ వారం ఒక్కసారిగా ధర పడిపోయింది. సరైన ధర పలకకపోవడంతో ఈ బుధవారం డముకు వారపు సంతకు వచ్చిన గిరిజన రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. డముకు వారపు సంతకు నిమ్మలపాడు, వాలసీ, జెండగరువు, గొర్రెగుమ్మి, బొడ్డపాడు, పెదబిడ్డ, గుమ్మ, చెరుకుబిడ్డ నుంచి పెద్ద ఎత్తున రైతులు సీతాఫలాలు తీసుకువచ్చారు. అయితే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, జామి, గంట్యాడ, మైదాన ప్రాంతాల వ్యాపారులు సిండికేట్‌గా మారి ఽధరను వారికి అనుకూలంగా మార్చుకున్నారని రైతులు ఆవేదన చెందున్నారు. గ్రామాల్లోని తమ ఇంటి వద్దకే వచ్చి గత వారం క్రేట్‌ సీతాఫలాలు రూ.700 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారని, ఈ వారం సంతకు వస్తే రూ.300 నుంచి రూ.400లకు మాత్రమే అడిగారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jul 30 , 2025 | 11:15 PM