ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖకు క్రూయిజ్‌

ABN, Publish Date - May 29 , 2025 | 01:45 AM

విశాఖపట్నానికి ఒక క్రూయిజ్‌ వస్తోందని, అది అండమాన్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందని ఎంపీ ఎం.శ్రీభరత్‌ వెల్లడించారు. కడపలో జరుగుతున్న మహానాడులో బుధవారం ఆయన ప్రసంగించారు. పర్యాటక రంగం అభివృద్ధితో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, విదేశీ పర్యాటకులను రప్పించేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయన్నారు.

అండమాన్‌కూ అవకాశం

మహానాడులో ఎంపీ ఎం.శ్రీభరత్‌

విశాఖపట్నం, మే 28 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నానికి ఒక క్రూయిజ్‌ వస్తోందని, అది అండమాన్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందని ఎంపీ ఎం.శ్రీభరత్‌ వెల్లడించారు. కడపలో జరుగుతున్న మహానాడులో బుధవారం ఆయన ప్రసంగించారు. పర్యాటక రంగం అభివృద్ధితో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, విదేశీ పర్యాటకులను రప్పించేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయన్నారు. వైసీపీ హయాంలో రుషికొండపై పర్యాటక రిసార్ట్స్‌ కూలగొట్టారని, పర్యాటక కేంద్రమైన అరకును డ్రగ్స్‌ కేంద్రంగా తయారు చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వచ్చాక అరకు కాఫీకి మళ్లీ జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్నారన్నారు. 2014-19 మధ్య ఏపీకి 23 కోట్ల మంది పర్యాటకులు వచ్చారని, ఏటా విశాఖ, అరకు ఉత్సవాలు నిర్వహించేవారని, వైసీపీ ప్రభుత్వం అవన్నీ నిలిపివేసిందన్నారు. కొత్త పర్యాటక పాలసీ ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

Updated Date - May 30 , 2025 | 03:01 PM