మళ్లీ కరోనా టెన్షన్!
ABN, Publish Date - May 24 , 2025 | 01:00 AM
కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. 2020 నుంచి 2022 వరకు భారత్‌తోసహా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన సంగతి తెలిసిందే. తరువాత కరోనా వైరస్ సమసిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే రెండు, మూడు వారాల నుంచి సింగపూర్, హాంగ్‌కాంగ్ నగరాల్లో మళ్లీ కరోనా లక్షణాలు కనిపించడం, పలు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
జిల్లా యంత్రాంగం అప్రమత్తం
అనకాపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి): కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. 2020 నుంచి 2022 వరకు భారత్‌తోసహా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన సంగతి తెలిసిందే. తరువాత కరోనా వైరస్ సమసిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే రెండు, మూడు వారాల నుంచి సింగపూర్, హాంగ్‌కాంగ్ నగరాల్లో మళ్లీ కరోనా లక్షణాలు కనిపించడం, పలు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గురువారం విశాఖపట్నంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా విషయంలో ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు తగు ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీఎంహెచ్‌వో డాక్టర్ శాంతిప్రభ... పీహెచ్‌సీలు, సీహెచ్‌సీ వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎక్కువ రోజులపాటు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. కాగా జనం రద్దీగా వుంటే రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. సామూహిక ప్రార్థనలు, సామాజిక సమావేశాలు, రాజకీయ పార్టీల మీటింగులకు హాజరయ్యే వారు మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆరుబయట తిరగవద్దని, ఇంటిలోనే విడిగా (హోమ్ ఐసోలేషన్) ఉండాలని సూచిస్తున్నారు.
Updated Date - May 24 , 2025 | 01:00 AM