ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వేసవిలోనూ శీతల వాతావరణం

ABN, Publish Date - Mar 26 , 2025 | 11:22 PM

ఉపరితల ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం జిల్లాలో శీతాకాల వాతావరణం నెలకొంటున్నది. పాడేరు పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం పొగమంచు కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు డి సెంబరు నెలను తలపించే వాతావరణం ఏర్పడింది.

పాడేరు- చింతపల్లి మార్గంలో పొగమంచు కారణంగా లైట్ల వెలుతురులో వెళుతున్న ఆర్టీసీ బస్సు

స్వల్పంగా తగ్గిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

ఉదయం 8 గంటల వరకు వీడని పొగమంచు

పాడేరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఉపరితల ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం జిల్లాలో శీతాకాల వాతావరణం నెలకొంటున్నది. పాడేరు పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం పొగమంచు కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు డి సెంబరు నెలను తలపించే వాతావరణం ఏర్పడింది. దీంతో ఉదయం రాకపోకలు సాగించే వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాల్సి వచ్చింది. ఉదయం, రాత్రి వేళల్లో శీతల గాలులు వీస్తుండగా, పగటి పూట మాత్రం ఎండ తీవ్రంగానే ఉంటోంది. గత నాలుగు రోజులతో పోలిస్తే రెండు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా(2 నుంచి 3 డిగ్రీలు) తగ్గుముఖం పట్టాయి.

జీకేవీధిలో 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

జీకేవీఽధిలో బుధవారం 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 34.6, చింతపల్లిలో 34.0, కొయ్యూరు, డుంబ్రిగుడలో 33.9, ముంచంగిపుట్టులో 33.0, పెదబయలులో 32.1, హుకుంపేటలో 31.9, జి.మాడుగులలో 31.5, అరకులోయలో 31.2, అనంతగిరిలో 30.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Mar 26 , 2025 | 11:22 PM