యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN, Publish Date - May 27 , 2025 | 11:03 PM
సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన చక్కని మార్గమని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం పాడేరులో యోగాంధ్ర ర్యాలీని మంగళవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి ర్యాలీని అంబేడ్కర్ సెంటర్ వరకు నిర్వహించారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
పాడేరులో ఉత్సాహంగా యోగాంధ్ర ర్యాలీ
పాడేరు, మే 27(ఆంధ్రజ్యోతి): సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన చక్కని మార్గమని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం పాడేరులో యోగాంధ్ర ర్యాలీని మంగళవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి ర్యాలీని అంబేడ్కర్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరి జీవన విధానంలో యోగాసనాలు ఒక భాగం కావాలని, ఆరోగ్యంగా జీవించేందుకు యోగాసనాలను ఆచరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు మేరకు వచ్చే నెల 21వ తేదీన నిర్వహించే యోగా కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 60 వేల మంది నమోదు చేసుకున్నారని, జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి పల్లెలో యోగాసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది మార్చి 7న అరకులోయలో 21 వేల మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పామని కలెక్టర్ గుర్తు చేశారు. జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని, అల్లూరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో జనం పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, యోగా నోడల్ అధికారి, టీడబ్ల్యూ ఎస్‌డీసీ ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, పరిపాలనాధికారి ఎం.హేమలత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థఽ పీడీ వి.మురళి, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జవహర్‌కుమార్, సమగ్ర శిక్షా ఏపీసీ స్వామినాయుడు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - May 27 , 2025 | 11:03 PM