అమరావతి మహిళలను కించపరిచిన వారిపై ఫిర్యాదు
ABN, Publish Date - Jun 08 , 2025 | 11:14 PM
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి చానల్‌లో డిబేట్ పేరుతో అమరావతి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజు, సాక్షి చానల్‌పై స్థానిక సీఐ డి.దీనబందుకు తెలుగు మహిళలు ఆదివారం ఫిర్యాదు చేశారు.
చర్యలు తీసుకోవాలని సీఐని కోరిన తెలుగు మహిళలు
పాడేరురూరల్, జూన్ 8(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి చానల్‌లో డిబేట్ పేరుతో అమరావతి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజు, సాక్షి చానల్‌పై స్థానిక సీఐ డి.దీనబందుకు తెలుగు మహిళలు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొర్రా విజయరాణి మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన మహిళలపై అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజు, మాట్లాడించిన సాక్షి చానల్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మహిళా కమిషన్ కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సొనారి రత్నకుమారి, లగిశపల్లి, కిండంగి పంచాయతీ సర్పంచులు లకే పార్వతమ్మ, కూడా శ్రీలక్ష్మి, టీడీపీ అరకు పార్లమెంట్ మహిళా ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి డిప్పల వెంకటకుమారి, అరకు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు గబ్బాడ కుమారి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బొడ్డేటి వరలక్ష్మి, గూడెం ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 08 , 2025 | 11:14 PM