ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం రాక రేపు

ABN, Publish Date - Jun 15 , 2025 | 12:39 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 16వ తేదీన విశాఖ పర్యటనకు రానున్నారు.

  • బీచ్‌రోడ్డులో యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలన

  • అనంతరం అధికారులతో సమీక్ష

  • మధ్యాహ్నం పీఎం పాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్యకర్తల సమావేశం

విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 16వ తేదీన విశాఖ పర్యటనకు రానున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.40 గంటలకు విశాఖ చేరుకుంటారు. పది నిమిషాలు ఎయిర్‌పోర్టులో గడిపిన తరువాత 10.50 గంటలకు బయలుదేరి ఆర్కే బీచ్‌రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పార్కు హోటల్‌ వరకూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు బయలుదేరి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించి, మధ్యాహ్నం 12.05 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళతారు. 12.15 నుంచి 1.30 గంటల వరకు యోగా దినోత్సవంపై అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నోవాటెల్‌ హోటల్‌లో బయలుదేరి 2.50 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు వెళ్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుని 5.35 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళతారు.

Updated Date - Jun 15 , 2025 | 12:39 AM