ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

10న సీఎం రాక

ABN, Publish Date - Jun 08 , 2025 | 01:02 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల పదో తేదీన నగరానికి రానున్నారు.

  • రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభం

  • యోగ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

  • 9న మంత్రి నారా లోకేశ్‌ రాక

విశాఖపట్నం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల పదో తేదీన నగరానికి రానున్నారు. సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ నిర్మించిన నూతన భవనంలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌తోపాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ఇంకా అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై ఆయన సమీక్షిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్‌ రావలసి ఉంది.

ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ ఈనెల తొమ్మిదో తేదీ ఉదయం 8.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వెళతారు. ఆరోజు రాత్రి నగరానికి చేరుకుని టీడీపీ కార్యాలయంలో బస చేస్తారు. ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి విజయవాడ వెళతారు.

Updated Date - Jun 08 , 2025 | 01:02 AM