ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:17 AM

అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేలు, పీఎం కిసాన్‌ కింద రూ.2 వేల నగదు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండడంతో అన్నదాతల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రెండు పథకాల కింద రైతులకు శనివారం తొలివిడత నిధులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేసిన విషయం తెలిసింది. దీంతో అర్హులైన ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేల చొప్పున జమ అవుతున్నాయి.

సీఎం చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్న రైతులు

మునగపాక, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేలు, పీఎం కిసాన్‌ కింద రూ.2 వేల నగదు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండడంతో అన్నదాతల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రెండు పథకాల కింద రైతులకు శనివారం తొలివిడత నిధులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేసిన విషయం తెలిసింది. దీంతో అర్హులైన ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేల చొప్పున జమ అవుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక కొత్తమహాలక్ష్మి పురిటిగెడ్డ ప్రాంతంలో రైతులు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ మాట్లాడుతూ, మునగపాక మండలంలో మండల వ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల మంది రైతుల రూ.6 కోట్ల పెట్టుబడి సాయం అందున్నదని చెప్పారు. మిగిలిన రూ.13 వేలు వచ్చే ఏడాది మార్చిలోపు రెండు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పెంటకోట విజయ్‌, దాడి శివ, విల్లూరి నరసింగరావు, బుద్ద వెంకటి, భీమునాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 12:17 AM