31న సీఎం చంద్రబాబు పాడేరు రాక
ABN, Publish Date - May 20 , 2025 | 11:31 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 31న అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు విచ్చేయనున్నారు.
పాడేరు, మే 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 31న అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు విచ్చేయనున్నారు. జూన్ నెల సామాజిక పెన్షన్ల పంపిణీని ఇక్కడే ప్రారంభించనున్నారు. అలాగే జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించి, లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధి, జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవోపైనా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
Updated Date - May 20 , 2025 | 11:31 PM