ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దైన్య స్థితిలో చిప్పాడ

ABN, Publish Date - Jul 22 , 2025 | 01:30 AM

మండలంలోని చిప్పాడు గ్రామస్థులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటుకు వ్యవసాయ భూములతోపాటు నివాస ప్రాంతాన్ని కూడా త్యాగం చేశారు.

రెండు దశాబ్దాల క్రితం సెజ్‌కు భూములు ఇచ్చి.. నిరాసితులైన రైతులు

పునరావాసానికి ఊబి నేలలో స్థలాలు కేటాయించిన నాటి ప్రభుత్వం

వెదురువాడ వద్ద స్థలాలు ఇవ్వాలని వినతి

నిర్ద్వందంగా తిరస్కరించిన అప్పటి ఎమ్మెల్యే

గత టీడీపీ హయాంలో వెదురువాడ వద్ద భూమి కేటాయింపు

స్థలాలు ఇచ్చే సమయంలో మారిన ప్రభుత్వం

జగనన్న కాలనీకి కేటాయించిన వైసీపీ పాలకులు

శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో కాలం వెళ్లదీత..

కూటమి ప్రభుత్వం దృష్టికి నిర్వాసితుల సమస్యలు

పునరావాసం కల్పించడానికి ఎమ్మెల్యే చర్యలు

అచ్యుతాపురం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని చిప్పాడు గ్రామస్థులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటుకు వ్యవసాయ భూములతోపాటు నివాస ప్రాంతాన్ని కూడా త్యాగం చేశారు. ఇది జరిగి సుమారు రెండు దశాబ్దాలు అయినప్పటికీ ఇంతవరకు సొంత గూడుకు నోచుకోలేదు. పునరావాస కాలనీ ఏర్పాటుకు గత టీడీపీ హయాంలో భూమిని కేటాయించగా, తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఈ భూమిని వేరే గ్రామాలకు చెందిన పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించింది. దీంతో శిథిలావస్థకు చేరిన పురాతన ఇళ్లల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రత్యేక అర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటుతో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 24 గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు. వీరికి దిబ్బపాలెం వద్ద 500 ఎకరాల్లో పునరావాసం కల్పించడానికి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందరితోపాటు చిప్పాడ పంచాయతీ పరిధిలోని చిప్పాడ, ఉద్దపాలెం నిర్వాసితులకు కూడా దిబ్బపాలెంలో స్థలాలు కేటాయించారు. అయితే వీరికి స్థలాలు కేటాయించిన ప్రదేశం ఊబి నేల కావడంతో ఇళ్లు నిర్మించుకోవడానికి వీలు కాలేదు. ప్రత్యామ్నాయంగా వెదురువాడ వద్ద పునరావాసం కల్పించాలని కోరారు. ఇది సాధ్యం కాదని, దిబ్బపాలెం వద్ద కేటాయించిన స్థలంలోనే ఇళ్లు నిర్మించుకోవాలని అప్పటి స్థానిక ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దీంతో చిప్పాడ నిర్వాసితులు ప్యాకేజీతోపాటు పునరావాసం కూడా పొందలేదు. మరోవైపు వీరి నుంచి ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వ్యవసాయం లేకపోవడంతో కర్మాగారాల్లో కూలిపనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 2014లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు.. చిప్పాడ నిర్వాసితుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపి, సీఎ చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వెదురువాడ వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించేలా కృషి చేశారు. ఇంటి పెద్దతోపాటు మేజర్లకు కూడా ప్యాకేజీతో పాటు పునరావాసానికి ఐదు సెంట్ల భూమి కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. వెదురువాడ వద్ద సుమారు 30 ఎకరాలు కేటాయించారు. తొలుత పరిహారం పంపిణీ ప్రారంభించారు. చిప్పాడలో 81 మందికి, ఉద్దపాలెంలో ఎనిమిది మంది పరిహారం అందింది. మిగిలిన వారికి నిధులు మంజూరు అయ్యే సమయానికి (2019) సాధారణ ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో పునరావాసానికి స్థలాలు కేటాయించలేదు. అంతేకాక 30 ఎకరాల్లో సుమారు పది ఎకరాలను వేరే గ్రామాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు.

ధైన్య స్థితిలో నిర్వాసితులు

చిప్పాడ నిర్వాసితులు అత్యంత ధైన్య స్థితిలో జీవనం సాగిస్తున్నారు. గ్రామాన్ని తరలించే ఉద్దేశం ఉండడంతో అధికారులు అభివృద్ధి పనులు నిలిపివేశారు. గ్రామంలోకి వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైపోయింది. వర్షం కురిస్తే బురదమయం అవుతున్నది. ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. మట్టి గోడలు కూలిపోయాయి. పై కప్పులు పాడైపోవడంతో టార్పాలిన్‌లు కప్పుకొని కాలం వెళ్లదీస్తున్నారు.

రాజాన జగ్గారావు, సెజ్‌ నిర్వాసితుడు, చిప్పాడ

ప్రత్యేక ఆర్థిక మండలి కోసం రెండు దశాబ్దాల క్రితం వ్యవసాయ భూములు తీసుకున్నారు. అప్పట్లో ఎకరాకు రూ.1.75 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. దిబ్బపాలెంలో ఊబిగా ఉన్న చోట ఇళ్ల స్థలాలకు కేటాయించారు. దీంతో అక్కడ స్థలాలు వద్దని చెప్పాం. టీడీపీ హయాంలో వెదురువాడ వద్ద భూమి కేటాయించగా, వైసీపీ ప్రభుత్వం స్థలాలు ఇవ్వలేదు. ఇంటిని బాగు చేసుకున్నా వృథానే. వర్షం కురిస్తే కారిపోతున్న పాకలో ఉంటున్నాం

చిప్పాడ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

ఎమ్మెల్యే విజయకుమార్‌

చిప్పాడ నిర్వాసితుల చాలా ధైన్య స్థితిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వీరికి తప్పకుండా న్యాయం చేస్తుంది. నిర్వాసితలు, ఏపీఐఐసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాను. ఇంటి యజమానులతోపాటు మేజర్లయిన యువతీయువకుల పేర్లతో జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించాను. త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం జరిగేలా చూస్తాను.

Updated Date - Jul 22 , 2025 | 01:30 AM