ఈకేవైసీకి పాట్లు
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:38 PM
అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులుగా చేరేందుకు గిరిజన రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
డుంబ్రిగుడలో జాతీయ రహదారి ఆనుకుని ఉన్న విశ్రాంతి భవనంలో రైతులకు ఈకేవైసీ చేస్తున్న సిబ్బంది
సిగ్నల్స్ అందక రైతుల అవస్థలు
అన్నదాత సుఖీభవ పథకం కోసం మండల కేంద్రానికి రావలసిన దుస్థితి
డుంబ్రిగుడ, జూన్ 16(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులుగా చేరేందుకు గిరిజన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లో నెట్ సిగ్నల్స్ అందక కండ్రుం పంచాయతీ సోర్నాయిగుడ, పనసపుట్టు, కుకడబెడ గ్రామస్థులు అన్నదాత సుఖీభవ పథకానికి ఈకేవైసీ చేయించుకునేందుకు మండల కేంద్రం డుంబ్రిగుడకు రావలసి వస్తోంది. కొందరు రైతులు సోమవారం సుదూర ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి వచ్చి ఈకేవైసీ చేయించుకున్నారు. మండల కేంద్రం జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న విశ్రాంతి భవనంలో ఈకేవైసీ ప్రక్రియ కొనసాగింది.
Updated Date - Jun 16 , 2025 | 11:38 PM