విరగ్గాసిన డ్రాగన్ ఫ్రూట్స్
ABN, Publish Date - Jun 04 , 2025 | 11:34 PM
మండలంలోని ఎగువశోభ పంచాయతీ మర్ధగడ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్స్ విరగ్గాశాయి. జన్ని సుబ్బారావు అనే గిరిజనుడు గత మూడేళ్ల నుంచి రెండున్నర ఎకరాల్లో ఏడాదికి రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నాడు.
మర్ధగుడ గ్రామ సమీపంలో గిరిజనులు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోట
అనంతగిరి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎగువశోభ పంచాయతీ మర్ధగడ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్స్ విరగ్గాశాయి. జన్ని సుబ్బారావు అనే గిరిజనుడు గత మూడేళ్ల నుంచి రెండున్నర ఎకరాల్లో ఏడాదికి రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నాడు. ప్రస్తుతం అరకు- విశాఖ ప్రధాన రహదారిని ఆనుకుని స్టాల్ పెట్టి జోరుగా డ్రాగన్ ఫ్రూట్స్ విక్రయిస్తున్నాడు. అటుగా వచ్చే పర్యాటకులు వీటిని కొనుగోలు చేస్తున్నారు.
Updated Date - Jun 04 , 2025 | 11:34 PM