ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇష్టారాజ్యంగా ఇటుక బట్టీలు

ABN, Publish Date - Jul 09 , 2025 | 12:27 AM

జిల్లాలోని పలు మండలాల్లో ఇటుక బట్టీల నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగుతోంది. గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన పన్ను ఎగవేస్తూ కొందరు నిర్వాహకులు యథేచ్ఛగా ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ఓల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ సమీపంలో చెరువులు, ప్రభుత్వ గోర్జలు, పంట కాలువల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అనకాపల్లి మండలం కోడూరు నుంచి కొండుపాలెం వెళ్లే రోడ్డు పక్కన ఇటుకల బట్టీ

- జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహణ

- ఓల్టా చట్టాన్ని ఉల్లంఘించి చెరువుల నుంచి మట్టి తరలింపు

- పంచాయతీకి, ప్రభుత్వానికి పన్నులు చెల్లించని వారు ఎందరో..

- ప్రభుత్వ ఆదాయానికి గండి

- చోద్యం చూస్తున్న అధికారులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని పలు మండలాల్లో ఇటుక బట్టీల నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగుతోంది. గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన పన్ను ఎగవేస్తూ కొందరు నిర్వాహకులు యథేచ్ఛగా ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ఓల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ సమీపంలో చెరువులు, ప్రభుత్వ గోర్జలు, పంట కాలువల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో ఇటుక బట్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా అనకాపల్లి, మునగపాక, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల మండలాల్లో పెద్ద సంఖ్యలో ఇటుక బట్టీలున్నాయి. మండలాల్లో సుమారు 450 ఇటుక బట్టీలున్నాయి. వీటిలో సగానికిపైగా అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి. ఇటుక బట్టీ ఏర్పాటు చేయాలంటే నిబంధనల ప్రకారం పంచాయతీకి బట్టీలో తయారవుతున్న ఇటుకల సంఖ్య ఆధారంగా రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. లక్ష ఇటుకలు తయారు చేసే ఇటుకల బట్టీల నిర్వాహకులు ట్రేడ్‌ లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. వ్యాపార జీఎస్‌టీ పన్ను 5 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. బట్టీలో తయారు చేసిన ఇటుకలు కాల్చేందుకు పొల్యూషన్‌ అధికారుల అనుమతులు పొందాలి. అంతే కాకుండా గ్రామ పంచాయతీ, రెవెన్యూ, జల వనరుల శాఖ, భూగర్భ గనులు, అటవీ శాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఇటుక బట్టీల నిర్వాహకులు ఇవేవీ పాటించడం లేదు. అనకాపల్లి, మునగపాక మండలాల్లో వందకు పైగా ఇటుక బట్టీలు ఉండగా, వాటిలో సగానికి పైగా కనీసం పంచాయతీ అనుమతి కూడా పొందలేదని తెలిసింది. మిగిలిన శాఖల అనుమతులు పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో అనకాపల్లి, సబ్బవరం, చోడవరం, మాడుగుల మండలాల నుంచి పెద్ద ఎత్తున లారీలు, వ్యానుల్లో లక్షల సంఖ్యలో ఇటుకలు విశాఖపట్నం, గాజువాక, పెందుర్తి వంటి ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. ఒక ఇటుక రూ.10 కాగా, దూరాన్ని బట్టి రూ.12 వరకు వసూలు చేస్తున్నారు. కొందరు ఇటుక బట్టీల నిర్వాహకులు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నా ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించడం లేదని తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిపై దృష్టి సారిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:27 AM