ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్కూటీని ఢీకొన్న బొలేరో

ABN, Publish Date - Apr 18 , 2025 | 10:29 PM

మండలంలోని వెంకయ్యపాలెం సమీపంలో జాతీయరహదారిపై శుక్రవారం సాయంత్రం బొలేరో వాహనం స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రమాదంలో మృతిచెందిన వీఆర్‌ఏ జన్ని మచ్చయ్య

ఎన్‌ఆర్‌పురం వీఆర్‌ఏ మృతి

మరొకరికి తీవ్రగాయాలు

అనంతగిరి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకయ్యపాలెం సమీపంలో జాతీయరహదారిపై అరకు వైపు నుంచి వస్తున్న బొలేరు వాహనం ఎస్‌.కోట నుంచి వస్తున్న స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎన్‌ఆర్‌పురం వీఆర్‌ఏ జన్ని మచ్చయ్య (45) అక్కడికక్కడే మృతి చెందగా, కోటపర్తి లచ్చయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన లచ్చయ్యను స్థానికులు ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ప్రాథమిక వైద్యం చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వీఆర్‌ఏ మచ్చయ్య, కోటపర్తి లచ్చయ్య సొంత పనులు నిమిత్తం ఉదయం ఎస్‌.కోట వెళ్లి సాయంత్రం తిరిగి స్కూటీపై స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్‌ఏ జన్ని మచ్చయ్య మృతిపై తహసీల్దార్‌ వి. మాణిక్యం, తోటి ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 18 , 2025 | 10:29 PM