ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘పేట సెగ్మెంట్‌లో వైసీపీకి దెబ్బ

ABN, Publish Date - Jul 21 , 2025 | 12:16 AM

పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి మరో భారీ షాక్‌ తగిలింది. ఎస్‌.రాయవరం మండలానికి చెందిన సీనియర్‌ నాయకుడు, మండల పరిషత్‌ తాత్కాలిక అధ్యక్షుడు అయిన బొలిశెట్టి గోవిందరావు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఎస్‌.రాయవరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.

ఎస్‌.రాయవరం మండల అధ్యక్షుడు బొలిశెట్టి రాజీనామా

వైసీపీ అధిష్ఠానం తీరుతో మనస్తాపం

‘బాబు ష్యూరిటీ... మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో పాల్గొనడం ఇష్టంలేదని వెల్లడి

ఎస్‌.రాయవరం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి మరో భారీ షాక్‌ తగిలింది. ఎస్‌.రాయవరం మండలానికి చెందిన సీనియర్‌ నాయకుడు, మండల పరిషత్‌ తాత్కాలిక అధ్యక్షుడు అయిన బొలిశెట్టి గోవిందరావు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఎస్‌.రాయవరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో వైసీపీ తరపున 18 మంది సర్పంచులు, 17 మంది ఎంపీటీసీలను గెలిపించుకున్నామని గుర్తు చేశారు. అప్పట్లో తమ పార్టీకి చెందిన కొంతమంది నేతల తీరువల్ల ఇబ్బందులు కలగడంతో, నాటి సీఎం జగన్‌ను కలవడానికి అవకాశం కల్పించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడికి, మంత్రులకు, నియోజకవర్గం కన్వీనర్‌కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. కానీ మూడేళ్ల కాలంలో ఒక్కసారి కూడా జగన్‌ను కలిసే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగిందన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో ఆయన కుమారుడైన జగన్మోహన్‌రెడ్డి వైసీపీని స్థాపించిన వెంటనే ఆ పార్టీలో చేరానని, వైసీపీ అభివృద్ధికి ఎంతో కష్టపడినప్పటికీ అధిష్ఠానం తనను చిన్నచూపు చూస్తున్నదని గోవిందరావు వాపోయారు. పార్టీ నిర్వహిస్తున్న ‘బాబు ష్యూరిటీ... మోసం గ్యారంటీ’ అనే కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని, ఈ కారణాల వల్ల వైసీపీకి, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గోవిందరావు ప్రకటించారు. ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, ఎంపీపీ (తాత్కాలిక) పదవిలో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు.

Updated Date - Jul 21 , 2025 | 12:16 AM