ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బిల్లెట్ల కన్వర్షన్‌ ప్రైవేటుపరం

ABN, Publish Date - Jul 24 , 2025 | 01:22 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం ప్రైవేటీకరణ చర్యల్లో భాగంగా బిల్లెట్లను టీఎంటీ బార్లుగా కన్వర్షన్‌ చేసే పనిని వైజాగ్‌ ప్రొఫైల్స్‌ మాతృ సంస్థ ‘స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియా’కు అప్పగించింది.

ఉక్కు కర్మాగారం నిర్ణయం

కాంట్రాక్టు దక్కించుకున్న వైజాగ్‌ ప్రొఫైల్స్‌

రూ.210 కోట్లతో ఒప్పందం

విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం ప్రైవేటీకరణ చర్యల్లో భాగంగా బిల్లెట్లను టీఎంటీ బార్లుగా కన్వర్షన్‌ చేసే పనిని వైజాగ్‌ ప్రొఫైల్స్‌ మాతృ సంస్థ ‘స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియా’కు అప్పగించింది. వాస్తవానికి టీఎంటీ బార్లను తయారుచేసే రోలింగ్‌ మిల్స్‌ స్టీల్‌ ప్లాంటులోను ఉన్నాయి. ఇప్పటివరకూ అక్కడే అవసరమైన సైజుల్లో టీఎంటీ బార్లను తయారు చేస్తున్నారు. కానీ ఎందుకనో ఈ పనిని బయటకు అప్పగించాలని నిర్ణయించారు. ఏడాదికి 1.2 లక్షల టన్నుల బిల్లెట్లను స్టీల్‌ ప్లాంటు సరఫరా చేస్తే వాటిని కొత్తవలసలో గల స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియా రోలింగ్‌ మిల్స్‌లో ‘వైజాగ్‌ టీఎంటీ బార్ల’గా తయారుచేసి వెనక్కి ఇస్తుంది. వాటిని స్టీల్‌ ప్లాంటు మార్కెట్‌లో విక్రయిస్తుంది. ఇందుకుగాను ఏడాదికి రూ.70 కోట్లు వరకు స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియాకు చెల్లించడానికి స్టీల్‌ ప్లాంటు అంగీకరించింది. రెండేళ్లకు ఒప్పందం చేసుకున్నారు. ఇంకో ఏడాది ఒప్పందం పెంచుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మొత్తం రూ.210 కోట్ల విలువైన పని వైజాగ్‌ ప్రొఫైల్స్‌కు దక్కింది.

Updated Date - Jul 24 , 2025 | 01:22 AM