బెంగళూరు-మల్దా టౌన్ ప్రత్యేక రైలు
ABN, Publish Date - Jul 03 , 2025 | 01:12 AM
ప్రయాణికుల సౌకర్యార్థం దువ్వాడ మీదుగా ఎస్‌ఎంవీ బెంగళూరు-మల్దా టౌన్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు ప్రవేశపెడుతున్నామని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. 06565 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 13న (ఆదివారం) రాత్రి 11.40 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరులో బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడ చేరి, తిరిగి అక్కడ నుంచి 6.15 గంటలకు బయలుదేరి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మల్దా టౌన్ చేరుతుంది.
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
ప్రయాణికుల సౌకర్యార్థం దువ్వాడ మీదుగా ఎస్‌ఎంవీ బెంగళూరు-మల్దా టౌన్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు ప్రవేశపెడుతున్నామని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. 06565 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 13న (ఆదివారం) రాత్రి 11.40 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరులో బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడ చేరి, తిరిగి అక్కడ నుంచి 6.15 గంటలకు బయలుదేరి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మల్దా టౌన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 06566 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు మల్దాలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.33 గంటలకు దువ్వాడ చేరుతుంది. తిరిగి అక్కడ నుంచి 3.35 గంటలకు బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరు చేరుతుంది.
మళ్లింపు మార్గంలో హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్
సంబల్‌పూర్ డివిజన్‌లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో విశాఖ-అమృత్‌సర్ మధ్య రాకపోకలు సాగించే హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు (20807/20808) తాత్కాలికంగా మళ్లింపు మార్గంలో నడుస్తాయని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ నుంచి ప్రతి మంగళ, శుక్ర, శనివారాల్లో బయలుదేరే హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807) జూలై 4 నుంచి ఆగస్టు 30 వరకు, తిరుగు ప్రయాణంలో అమృత్‌సర్‌లో ప్రతి ఆది, బుధ, శనివారాల్లో బయలుదేరే అమృత్‌సర్-విశాఖ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20808) జూలై 2 నుంచి ఆగస్టు 31 వరకు సర్లా జంక్షన్, సంబల్‌పూర్ సిటీ రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 01:12 AM