ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జనసేనలో చేరిన బెహరా భాస్కరరావు

ABN, Publish Date - Apr 18 , 2025 | 12:51 AM

మాజీ కార్పొరేటర్‌ బెహరా భాస్కరరావు గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో జనసేనలో చేరారు.

గోపాలపట్నం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి):

మాజీ కార్పొరేటర్‌ బెహరా భాస్కరరావు గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయనతో పాటు అడవివరం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌లు గునిశెట్టి శ్రీనివాసరావు, గేదెల మురళీకృష్ణ, గోపాలపట్నంకు చెందిన పలువురు జనసేన కండువా కప్పుకున్నారు. బెహరా భాస్కరరావు నాలుగు రోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


వైసీపీకి మరో కార్పొరేటర్‌ గుడ్‌బై

వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ముత్తంశెట్టి ప్రియాంక లేఖ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి):

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరొక కార్పొరేటర్‌ గుడ్‌బై చెప్పేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె, జీవీఎంసీ ఆరో వార్డు కార్పొరేటర్‌ ముత్తంశెట్టి ప్రియాంక గురువారం లేఖ విడుదల చేశారు. జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి నేతలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్‌పై కౌన్సిల్‌ సమావేశం జరగడానికి రెండు రోజులు ముందు ఆమె వైసీపీని వీడడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన పెరిగింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో కూటమికి ఆమె మద్దతుగా నిలుస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు 74వ వార్డు కార్పొరేటర్‌ తిప్పల వంశీరెడ్డితోపాటు బెహరా భాస్కరరావు భార్య 92వ వార్డు కార్పొరేటర్‌ స్వర్ణలత, కోడలు, 91వ వార్డు కార్పొరేటర్‌ కుంచె జ్యోత్స్న వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు.

Updated Date - Apr 18 , 2025 | 12:51 AM