ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొమ్మంగి బ్రిడ్జి వద్ద ఆటో బోల్తా

ABN, Publish Date - Jun 29 , 2025 | 12:09 AM

మండలంలోని కొమ్మంగి బ్రిడ్జి వద్ద సర్వీసు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులు గాయపడగా, నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

కొమ్మంగి బ్రిడ్జి వద్ద బోల్తా పడిన ఆటో

పది మందికి గాయాలు, నలుగురి పరిస్థితి ఆందోళనకరం

చింతపల్లి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొమ్మంగి బ్రిడ్జి వద్ద సర్వీసు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులు గాయపడగా, నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. శనివారం కుదుపుసింగి గ్రామానికి చెందిన సర్వీసు ఆటోలో కొమ్మంగి నుంచి కొంత మంది ప్రయాణికులు చింతపల్లి వస్తున్నారు. కొమ్మంగి బ్రిడ్జి వద్ద బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది గాయపడ్డారు. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో అంబులెన్సులో క్షతగాత్రులను చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన కుడుముల జానకమ్మ, దేవకుమారి, చంద్రమ్మ, పెద్దమ్మలకు స్థానిక వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో ఆరుగురు స్వల్పగాయాలతో చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 29 , 2025 | 12:09 AM