ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తొలి రోజు హాజరు అంతంత మాత్రమే...

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:57 AM

వేసవి సెలువులు ముగిసి... ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నా సగానికి పైగా విద్యార్థులు మొహం చాటేశారు. దీని వలన తొలి రోజు విద్యార్థులు హాజరు లేకపోవడంతో పాఠశాలన్నీ బోసిపోయాయి. తరగతి గదులు ఖాళీగా దర్శనమిచ్చాయి.

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల(తురకబడి)లో సగం వరకు ఖాళీగా ఉన్న బెంచీలు

మండలంలో 54 ప్రభుత్వ పాఠశాలలు

9,447 మంది విద్యార్థులకు 4,509 మంది హాజరు

పెదబొడ్డేపల్లి ఏపీఆర్‌ఎస్‌లో సున్నా హాజరు

పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన హెచ్‌ఎంలు

నర్సీపట్నం, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): వేసవి సెలువులు ముగిసి... ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నా సగానికి పైగా విద్యార్థులు మొహం చాటేశారు. దీని వలన తొలి రోజు విద్యార్థులు హాజరు లేకపోవడంతో పాఠశాలన్నీ బోసిపోయాయి. తరగతి గదులు ఖాళీగా దర్శనమిచ్చాయి. పెదబొడ్డేపల్లి ఏపీ రెసిడెన్సియల్‌ స్కూల్లో 318 మంది విద్యార్థులకు ఒక్కరు కూడా హాజరు కాలేదు. పెదబొడ్డేపల్లి జడ్పీహెచ్‌ స్కూల్‌ 556 మందికి 75 మంది హాజరయ్యారు. వేములపూడి జడ్పీహెచ్‌ఎస్‌(బాలికలు) 410 మందికి 41, నర్సీపట్నం జడ్పీహెచ్‌ఎస్‌(తురకబడి) 157 మందికి 25, జడ్పీహెచ్‌ఎస్‌ బాలికలు 428 మందికి 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. వేములపూడి పీబీఎం జడ్పీహెచ్‌ఎస్‌లో 278 మంది 21 మంది, మోడల్‌ స్కూల్‌లో 348 మందికి 91, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 196 మంది హాజరుకావల్సి ఉండగా 11 మంది హాజరయ్యారు. గురందొరపాలెం ఎంపీపీ స్కూల్లో 73 మంది విద్యార్థులకు ఆరుగురు హాజరయ్యారు. నర్సీపట్నం మండలంలో 54 ప్రభుత్వ పాఠశాలలో 9,447 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,509 మంది మాత్రమే హాజరయ్యారు. 4938 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

పాఠ్య పుస్తకాలు పంపిణీ

ప్రభుత్వ పాఠశాలకు హాజరైన విద్యార్థుల వరకు పాఠ్య పుస్తకాలు, నోట్స్‌ పంపిణీ చేశారు. స్కూల్‌ బ్యాగులు, బూట్లు, ఏకరీతి దుస్తులు త్వరలో పంపిణీ చేస్తారు.

దేవరాపల్లిలో..

దేవరాపల్లి: మండలంలోని పాఠశాలల్లో గురువారం సందడి నెలకొంది. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా విద్యాలయాలకు వచ్చారు. అయితే తొలి రోజు హాజరు అంతంతమాత్రంగానే ఉంది. పాఠశాలలకు 50 శాతం వరకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు చేరాయి. వాటిని ఈ నెల 20 నుంచి పంపిణీ చేయనున్నట్టు ఎంఈవో-2 వి.ఉషారాణి గురువారం విలేకరులకు తెలిపారు. బూట్లు, సాక్సులు, బ్యాగులు ఇంకా రావలసి ఉందన్నారు. మండలంలోని 56 పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు 2,491 మంది విద్యార్థినీ, విద్యార్థులున్నారన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:57 AM