ఆశ్రమ పాఠశాలలు వెలవెల!
ABN, Publish Date - Jun 13 , 2025 | 01:06 AM
భించగా మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలకు ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు. మండలంలోమొత్తం 11 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు వున్నాయి. తొలి రోజు ఉపాధ్యాయులు మినహా విద్యార్థులు ఎవరూ రాలేదు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులు హాజరుకావాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ముందుగానే సమాచారం ఇచ్చారు.
స్కూళ్లు పునఃప్రారంభమైన తొలిరోజు ఒక్క విద్యార్థి కూడా రాని వైనం
రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడమే కారణమన్న అభిప్రాయం
సోమవారం నుంచి హాజరవుతారంటున్న తల్లిదండ్రులు
చింతపల్లి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను గురువారం పునఃప్రారంభించగా మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలకు ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు. మండలంలోమొత్తం 11 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు వున్నాయి. తొలి రోజు ఉపాధ్యాయులు మినహా విద్యార్థులు ఎవరూ రాలేదు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులు హాజరుకావాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. సుమారు 45 రోజులపాటు వేసవి సెలవులు తీసుకున్న విద్యార్థులు.. తొలి రోజు పాఠశాలకు హాజరుకావడానికి ఆసక్తి చూపలేదు. గతంలో వేసవి, దసరా, సంక్రాంతి సెలవుల అనంతరం ఆశ్రమ పాఠశాలలకు అరకొరగానే విద్యార్థులు హాజరయ్యేవారు. వారం రోజుల తరువాత దాదాపుగా పూర్తి హాజరు వుండేది. ఈ ఏడాది గురువారం నుంచి పాఠశాలలు తెరవడం, తరువాత రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో విద్యార్థులు సోమవారం నుంచి పాఠశాలలకు హాజరవుతారని తల్లిదండ్రులు చెబుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. అయితే విద్యార్థులను వెంటనే పాఠశాలలకు పంపాలని, లేకపోతే చదువులో వెనుకబడిపోతారని ఏటీడబ్ల్యూవో జయ నాగలక్ష్మి అన్నారు.
Updated Date - Jun 13 , 2025 | 01:06 AM