గోవా బయలుదేరిన అశోక్‌గజపతిరాజు
ABN, Publish Date - Jul 26 , 2025 | 01:00 AM
గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు శుక్రవారం గోవా బయలుదేరి వెళ్లారు.
గోపాలపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):
గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు శుక్రవారం గోవా బయలుదేరి వెళ్లారు. సతీసమేతంగా మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ప్రొటోకాల్ అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన విమానంలో హైదరాబాద్ బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి గోవా చేరుకుంటారు. శనివారం గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Updated Date - Jul 26 , 2025 | 01:00 AM