ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కళ తప్పిన డెమో స్కూల్‌

ABN, Publish Date - Apr 22 , 2025 | 01:34 AM

నూతన విద్యా విధానం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఒకే ఒక్క జీవో.. ప్రాథమిక పాఠశాల విద్యను నిర్వీర్యం చేసింది.

  • మునగపాక ప్రాథమిక పాఠశాల-1లో అరకొరగా విద్యార్థులు

  • గత ప్రభుత్వంలో పాఠశాలల విలీనానికి ముందు 350 మంది పిల్లలు

  • 3, 4, 5 తరగతుల తరలింపుతో పడిపోయిన సంఖ్య

  • ఈ ఏడాది 1, 2 తరగతుల్లో 13 మంది విద్యార్థులు!

  • ఖాళీగా ఆరు తరగతి గదులు

  • నాడు-నేడు పేరుతో ఖర్చు చేసిన రూ.40 లక్షలు వృథా

మునగపాక, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి):

నూతన విద్యా విధానం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఒకే ఒక్క జీవో.. ప్రాథమిక పాఠశాల విద్యను నిర్వీర్యం చేసింది. ఈ జీవో తీసుకురావడానికి ముందు పాఠశాలల్లో నాడు-నేడు పేరుతో అదనపు గదుల నిర్మాణం, మరమ్మతులు, ఇతర సదుపాయాల కోసం ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు వృథా అయ్యాయి. ఇందుకు మునగపాకలోని ప్రాథమిక పాఠశాల-1 ఒక ఉదాహరణగా చెప్పాలి. వివరాల్లోకి వెళ్లితే...

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పేరుతో ‘మన బడి నాడు-నేడు’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ప్రాథమిక పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ‘డెమో’పేరుతో పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో మునగపాకలోని ఒకటో నంబరు ప్రాథమిక పాఠశాల కూడా వుంది. రూ.40 లక్షలు మంజూరు కావడంతో అప్పటికే వున్న భవనాలకు రంగులు వేసి, మరుగుదొడ్లు నిర్మించారు. తరగతి గదుల్లో బెంచీలు సమకూర్చారు. ఈ పనులు జరగకముందు 2019-20 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వంద మంది విద్యార్థులు వుండేవారు. పనులు పూర్తయిన తరువాత ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను కూడా ఇక్కడ చేర్చడంతో 2020-21 విద్యా సంవత్సరంలో ఏకంగా 350 మందికి పెరిగారు. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు వుండేవి. విద్యార్థులతో పాఠశాల కళకళలాడింది. అయితే ఈ కళకళ రెండేళ్లు తిరక్కుండానే మాయమైంది. నూతన విద్యావిధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేసింది. దీనిని మునగపాక ప్రాథమిక పాఠశాల-1లో కూడా అమలు చేశారు. సుమారు మూడు వందల మంది విద్యార్థులను ఉన్నత పాఠశాలకు పంపడంతో డెమో స్కూళ కళ తప్పింది. జడ్పీ పాఠశాలకు పంపడం ఇష్టం లేని పలువురు తల్లిదండ్రులు తిరిగి ప్రైవేటు స్కూళ్లలో చేర్పించారు. కొత్తగా ఒకటి, రెండు తరగతుల్లో చేరేవారు తగ్గిపోయారు. ప్రస్తుతం ఒకటో తరగతిలో ముగ్గురు, రెండో తరగతలో 10 మంది విద్యార్థులు వున్నారు. మొత్తం తొమ్మిది తరగతి గదులకుగాను మూడు గదులే వినియోగంలో వున్నాయి. ఆరు గదులకు తాళాలు వేశారు. ఇప్పుడు రెండో తరగతిలో వున్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలకు వెళ్లిపోవాలి. ఒకటో తరగతిలో వున్న ముగ్గురు రెండో తరగతిలోకి వస్తారు. ఒక కొత్తగా ఒకటో తరగతిలో ఎంత మంది చేరతారో తెలియని పరిస్థితి. మొత్తం మీద ఒకప్పుడు 350 మంది విద్యార్థులు వున్న ఈ పాఠశాలలో ఇప్పుడు పట్టుమని పది మంది కూడా లేని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం అనాలోచితంగా అమలు చేసిన నూతన విద్యా విధానమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పూర్వ వైభవంపై ఆశలు

ప్రస్తుత ప్రభుత్వం మోడల్‌ ఫ్రైమరీ స్కూల్‌ పేరుతో ప్రాథమిక విద్యను ప్రక్షాళన చేయనున్నదని హెచ్‌.ఎం కె.వి.రమణమ్మ తెలిపారు. ఇందులో భాగంగా తమ పాఠశాలలో 3, 4, 5 తరగతులు పునరుద్ధరణ అయ్యే అవకాశం వుందన్నారు. దీంతో పూర్వవైభవం వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 22 , 2025 | 01:34 AM