విహార నౌక ‘ఎంవీ ఎంప్రెస్’ రాక
ABN, Publish Date - Jul 03 , 2025 | 01:15 AM
విశాఖపట్నం పోర్టులో రూ.100 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌కు బుధవారం తొలి విహార నౌక ‘ఎంవీ ఎంప్రెస్’ రావడంతో నగరంలో పర్యాటకుల సందడి కనిపించింది.
తీరంలో పర్యాటక సందడి
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం పోర్టులో రూ.100 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌కు బుధవారం తొలి విహార నౌక ‘ఎంవీ ఎంప్రెస్’ రావడంతో నగరంలో పర్యాటకుల సందడి కనిపించింది. చెన్నై నుంచి వచ్చిన ఈ నౌకలోని పర్యాటకులు ఉదయం టెర్మినల్‌లో దిగి ఆర్‌కే బీచ్‌లో కొద్దిసేపు గడిపి, ఆ తరువాత నగర పర్యటన చేశారు. తిరిగి సాయంత్రం టెర్మినల్‌కు చేరుకోగా వారితో విశాఖ వాసులు కూడా కొందరు అందులో ఎక్కి పాండిచ్చేరి మీదుగా చెన్నై ప్రయాణమయ్యారు. టెర్మినల్‌కు వచ్చిన తొలి నౌక కావడంతో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ విజయవాడ నుంచి వచ్చారు. వారితో పాటు విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పర్యాటక శాఖ అధికారులు నౌకలోకి వెళ్లి అన్నీ పరిశీలించారు.
Updated Date - Jul 03 , 2025 | 01:15 AM