గురుకుల పాఠశాలలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:09 PM
ఇక్కడి మేహాద్రిగెడ్డ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎ.మృదుల ప్రియదర్శిని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
గోపాలపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఇక్కడి మేహాద్రిగెడ్డ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎ.మృదుల ప్రియదర్శిని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 25న అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. 6, 7 తరగతులకు దర ఖాస్తు చేసుకున్నవారికి ఆరోజు ఉదయం 10 గంటలకు, 8, 9 తరగతుల వారికి మధ్యాహ్నం 2 గంటలకు రాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 11:09 PM