ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి అప్పన్న చందనోత్సవ టికెట్ల విక్రయం

ABN, Publish Date - Apr 24 , 2025 | 01:24 AM

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం టికెట్ల విక్రయాన్ని గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కొమ్ముల సుబ్బారావు ప్రకటించారు. రూ.300, రూ.1000 టికెట్లను గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకూ కొండపై దేవస్థానం పాత పీఆర్‌ఓ కార్యాలయంలో, అదేవిధంగా యూనియన్‌ బ్యాంక్‌ సింహాచలం, అక్కయ్యపాలెం, కేజీహెచ్‌, మహారాణిపేట బ్రాంచీలు, భారతీయ స్టేట్‌ బ్యాంకు సింహాచలం, బిర్లా జంక్షన్‌, సాలిగ్రామపురం శాఖల్లో పొందవచ్చునన్నారు.

సింహాలం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం టికెట్ల విక్రయాన్ని గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కొమ్ముల సుబ్బారావు ప్రకటించారు. రూ.300, రూ.1000 టికెట్లను గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకూ కొండపై దేవస్థానం పాత పీఆర్‌ఓ కార్యాలయంలో, అదేవిధంగా యూనియన్‌ బ్యాంక్‌ సింహాచలం, అక్కయ్యపాలెం, కేజీహెచ్‌, మహారాణిపేట బ్రాంచీలు, భారతీయ స్టేట్‌ బ్యాంకు సింహాచలం, బిర్లా జంక్షన్‌, సాలిగ్రామపురం శాఖల్లో పొందవచ్చునన్నారు. దేవస్థానం వెబ్‌సైట్‌లో కూడా ఈనెల 29వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకూ అందుబాటులో ఉంటాయన్నారు. ఈనెల 29, 30 తేదీల్లో దర్శనం టికెట్ల విక్రయాలు జరగవన్నారు. ఉచిత దర్శనం కోరుకునే వారికి ప్రత్యేక క్యూ ఏర్పాటుచేసినట్టు ఈఓ ప్రకటించారు.

Updated Date - Apr 24 , 2025 | 01:24 AM