నగరంలో మరో కరోనా కేసు?
ABN, Publish Date - May 27 , 2025 | 01:33 AM
నగర పరిధిలోని గోపాలపట్నం 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఒకరికి కరోనా వచ్చినట్టు తెలిసింది.
హౌస్ సర్జన్‌కు పాజిటివ్
గోపాలపట్నం ఆరోగ్య కేంద్రంలో కలకలం
గోపాలపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):
నగర పరిధిలోని గోపాలపట్నం 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఒకరికి కరోనా వచ్చినట్టు తెలిసింది. హౌన్ సర్జన్‌గా పనిచేసేందుకు వచ్చిన యువతికి కొవిడ్ పాజిటివ్ రావడంతో హోమ్ క్వారైంటైన్‌లో ఉన్నట్టు సమాచారం. దీంతో ఆసుపత్రి సిబ్బంది అంతా సోమవారం మాస్క్‌లు పెట్టుకుని కనిపించారు. రోగులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అయితే హౌస్ సర్జన్‌కు కరోనా వచ్చిన విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించలేదు. తమ దృష్టికి రాలేదన్నారు.
గ్రేడ్-2 హెచ్‌ఎంలుగా పదోన్నతి సాధించిన స్కూల్ అసిస్టెంట్ సర్టిఫికెట్ల పరిశీలన నేడు
విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి అర్హత సాధించిన స్కూల్ అసిస్టెంట్ల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం సీతమ్మధారలోని ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాలలో జరగనున్నది. స్కూల్ అసిస్టెంట్లు ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ రిజిస్టర్, నిర్దేశించిన ధ్రువపత్రాలతో హాజరుకావాలని పాఠశాల విద్యా ఆర్జేడీ విజయభాస్కర్, విశాఖ డీఈవో ప్రేమ్‌కుమార్ వేర్వేరు ప్రకటనల్లో సూచించారు.
Updated Date - May 27 , 2025 | 01:33 AM