ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై ఉక్కుపాదం

ABN, Publish Date - May 17 , 2025 | 12:48 AM

దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు ఉగ్రమూకలు, వాటిని పెంచి పోషిస్తున్న శక్తులు కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం సాయంత్రం ఉపమాక హైవే జంక్షన్‌ నుంచి నక్కపల్లి పాఠశాల వరకు నియోజకవర్గం కూటమి నాయకులతో కలిసి ‘తిరంగా ర్యాలీ’ నిర్వహించారు.

తిరంగా ర్యాలీలో హోం మంత్రి అనిత, జనసేన నేత గెడ్డం బుజ్జి, టీడీపీ నాయకులు కాశీనాయుడు, చిట్టిబాబు, వెంకటేశ్‌, అబద్ధం, బుజ్జి, తదితరులు

రాష్ట్ర హోం మంత్రి అనిత

నక్కపల్లిలో తిరంగా ర్యాలీ

నక్కపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు ఉగ్రమూకలు, వాటిని పెంచి పోషిస్తున్న శక్తులు కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం సాయంత్రం ఉపమాక హైవే జంక్షన్‌ నుంచి నక్కపల్లి పాఠశాల వరకు నియోజకవర్గం కూటమి నాయకులతో కలిసి ‘తిరంగా ర్యాలీ’ నిర్వహించారు. త్రివర్ణ పతాకాలతో భరతమాతకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే వారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతాయని ఆమె హెచ్చరించారు. పాకిస్థాన్‌కు గట్టి బుద్ది చెప్పి, భారత్‌కు విజయాన్ని అందించిన త్రిదళాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాటం చేసే క్రమంలో మన రాష్ట్రానికి చెందిన మురళీనాయక్‌ అమరుడు కావడం చాలా బాధాకరమన్నారు. ఈ సందర్భంగా పలువురు మాజీ సైనికులను ఆమె సత్కరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు గెడ్డం బుజ్జి, తోట నగేశ్‌, లాలం కాశీనాయుడు, కొప్పిశెట్టి వెంకటేశ్‌, అమలకంటి అబద్ధం, పెదిరెడ్డి చిట్టిబాబు, కొప్పిశెట్టి బుజ్జి, తదితరులు పాల్గొన్నారు

Updated Date - May 17 , 2025 | 12:48 AM