ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అక్షరం అండగా...ముందడుగు

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:53 AM

జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని తిరుమలనగర్‌ వాసులు ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ సదస్సులో లేవనెత్తిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషిచేస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.

  • సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు

  • సమష్టిగా పనిచేయాలి

  • అందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రారంభించిన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ దోహదం

  • ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య అభినందనీయులు

  • తిరుమల నగర్‌లోని మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తా

  • తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని తిరుమలనగర్‌ వాసులు ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ సదస్సులో లేవనెత్తిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషిచేస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. తిరుమల నగర్‌ ఆర్య వైశ్య సామాజిక భవనంలో జనవరి 28న ‘ఆంధ్రజ్యోతి’ ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ సదస్సు నిర్వహించగా, ప్రజలు అనేక సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రజలు లేవనెత్తిన సమస్యల్లో ప్రధానమైనవి పరిష్కారం కావడంతో సోమవారం తిరిగి అదే భవనంలో సభ నిర్వహించడం జరిగింది. ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచి మేనేజర్‌ కె.రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాటి సదస్సులో ప్రజలు లేవనెత్తిన ప్రధాన సమస్యలను ‘ఆంధ్రజ్యోతి’ చొరవతో సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించారన్నారు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కారిస్తానని పల్లా హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావడమే కాకుండా...అవి పరిష్కారమయ్యే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య సామాజిక స్పృహ అభినందనీయమన్నారు. స్థానికులు అనధికార డంపింగ్‌ యార్డు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమంలో చెప్పగా, ‘ఆంధ్రజ్యోతి’ అనేక కోణాల్లో కథనాలు ప్రచురించిందని, దాంతో ఏపీఐఐసీ ఐలా కమిషనర్‌ స్పందించారన్నారు. యార్డులో చెత్తను వేరొకచోటకు తరలించి, ప్రహరీ గోడ నిర్మించారన్నారు. దీర్ఘకాల సమస్య పరిష్కారమవ్వడంతో స్థానికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారంటూ సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్‌ ఎడిషన్‌లో ప్రచురితమైన కథనాన్ని సభకు హాజరైన వారికి పల్లా శ్రీనివాసరావు చూపించారు. అలాగే తిరుమల నగర్‌కు బస్సు కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నాసరే ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమం ద్వారా పరిష్కారమైనందుకు సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టిగా పనిచేయాలని, ‘ఆంధ్రజ్యోతి’ ప్రారంభించిన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమంతో అది సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. సమాజం పట్ల వేమూరి ఆదిత్యకు ఉన్న అవగాహన తనను ఆకట్టుకుందన్నారు. సమాజంలోని దురాచారాలను వెలికితీసి, చైతన్యపరిచే కృషిని కొనసాగించడం ద్వారా మరింత ఎత్తుకు ఎదగాలని అభిలషించారు. సమాజాన్ని గాడిలో పెట్టాలంటే అధికారులు, ప్రజా ప్రతినిధులను నిలదీయడంతోపాటు చైతన్యపరచడం, జాగృతపరచడం అవసరమన్నారు. ఆ బాధ్యతను ప్రజలకు గుర్తుచేయడమే కాకుండా వారికి అండగా నిలిచే బాధ్యత తీసుకున్న ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ, డైరెక్టర్‌ వేమూరి ఆదిత్యతోపాటు ‘ఆంధ్రజ్యోతి’ బృందాన్ని అభినందిస్తున్నానన్నారు.

‘ఆంధ్రజ్యోతి’ చొరవతో సమస్యల పరిష్కారం: కార్పొరేటర్‌ బొండా జగన్‌

87వ వార్డు కార్పొరేటర్‌ బొండా జగన్‌ మాట్లాడుతూ అనధికార డంపింగ్‌ యార్డు గురించి తాము అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. కానీ ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమంలో ఈ సమస్యను స్థానికులు లేవనెత్తడంతో ఐలా కమిషనర్‌ కిషోర్‌ స్పందించి యార్డులోని చెత్త తరలింపు, ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.14 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచి, రికార్డు స్థాయిలో మూడు నెలల్లో పనులు పూర్తిచేశారని అభినందించారు. తన వార్డులో గెడ్డల నిర్మాణం కోసం రూ.పది కోట్లు కేటాయింపు జరిగిందన్నారు. సిద్ధార్థ నగర్‌లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గత ప్రభుత్వంలో కుట్ర జరిగితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల వ్యవధిలో దానిని చదును చేయడం జరిగిందని, ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.1.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ కృషితో రైల్వేస్టేషన్‌ వరకూ బస్సు సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. పార్కుల్లో గంజాయి వినియోగం, ఆకతాయిల ఆగడాలకు ఏసీపీ త్రినాథ్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అడ్డుకట్ట వేయడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. లోఓల్టేజీ సమస్య పరిష్కారం కూడా ఆంధ్రజ్యోతి చొరవేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్‌-5 కమిషనర్‌ బీఆర్‌ఎస్‌ శేషాద్రి, ఏసీపీ త్రినాథ్‌, ఐలా కమిషనర్‌ కిషోర్‌, ఆర్టీసీ కూర్మన్నపాలెం డిపో ఏడీఎం శ్రీనివాసరావు, ఏపీఈపీడీఏఈ వీర్రాజు, 87వ వార్డు టీడీపీ అధ్యక్షుడు ఎస్‌.ఎస్‌.విజయరామరాజు, ‘ఆంధ్రజ్యోతి’ సర్క్యులేషన్‌ డైరెక్టర్‌ రామకృష్ణారావు, న్యూస్‌ ఎడిటర్‌ ఎల్‌.వి.రామాంజనేయులు, బ్యూరో ఇన్‌చార్జి యర్రా శ్రీనివాసరావు, యాడ్స్‌ మేనేజర్‌ కళ్యాణ్‌చక్రవర్తి, సర్క్యులేషన్‌ ఏసీఎం బి.సత్యనారాయణ, ఆంధ్రజ్యోతి సిబ్బంది, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి మహేష్‌, కార్యదర్శి కె.మధుసూధన్‌శెట్టి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 12:53 AM