11న వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శన
ABN, Publish Date - Jul 06 , 2025 | 11:47 PM
పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో ఈ నెల 11న ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, జూలై 6(ఆంధ్రజ్యోతి): పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో ఈ నెల 11న ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ యంత్రాల ప్రదర్శనతో పాటు వాటి వినియోగం, ప్రయోజనాలు తెలియజేస్తారన్నారు. రైతులు ప్రత్యక్షంగా పరిశీలించి, వివరాలు తెలుసుకొని ప్రభుత్వం ఇచ్చే రాయితీతో కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు చుట్టుపక్కల రోలుగుంట, కోటవురట్ల, రావికమతం, కశింకోట మండలాల రైతులు కూడా ప్రదర్శనకు రావాలని కోరారు.
Updated Date - Jul 06 , 2025 | 11:47 PM