వయోజనులను అక్ష్యరాస్యులుగా చేయాలి
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:15 AM
నిరక్ష్యరాస్యులైన వయోజనులందరినీ అక్ష్యరాస్యులాగా తీర్చిద్దాలన్నదే ‘అక్షరాంధ్ర-ఉల్లాస్’ (యూఎల్‌ఎల్‌ఏఎస్- అండర్‌స్టాండింగ్ ఆప్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) లక్ష్యమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు.
ఈ ఏడాది 89,944 మంది లక్ష్యం
డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా అధికారులు బాధ్యత తీసుకోవాలి
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): నిరక్ష్యరాస్యులైన వయోజనులందరినీ అక్ష్యరాస్యులాగా తీర్చిద్దాలన్నదే ‘అక్షరాంధ్ర-ఉల్లాస్’ (యూఎల్‌ఎల్‌ఏఎస్- అండర్‌స్టాండింగ్ ఆప్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) లక్ష్యమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాస్థాయి అక్షరాంధ్ర సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం మొదటి విడతగా ఈ ఏడాది నిరక్షరాస్యులైన 89,944 మంది వయోజనులను అక్ష్యరాస్యులుగా చేయాలన్నారు. ఇందుకోసం డీఆర్‌డీఏ, మెప్మా, డ్వామా అధికారులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో నిరక్షరాస్యులైన డ్వాక్రా మహిళలను గుర్తించి డీఆర్‌డీఏ సహకారంతో అందరినీ అక్షరాస్యులుగా తయారు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది డీఆర్‌డీఏ శాఖ ద్వారా 50 వేల మంది మహిళలు, డ్వామా ద్వారా 31,339 మంది, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల పరిధిలోని మెప్మా ద్వారా 8,605 మంది.. మొత్తం 89,944 మంది నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామాల్లో నిరక్షరాస్యులను గుర్తించి ప్రత్యేక వలంటీర్లతో రోజూ సాయంత్రం అంగన్‌వాడీ కేంద్రం లేదా ప్రభుత్వ భవనంలో తరగతులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ నారాయణమూర్తి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వయోజన విద్య శాఖ సంచాలకుడు ఎస్‌ఎస్ వర్మ, జిల్లా సమన్వయాధికారి చిన్నికృష్ణ, డీఈఓ గిడ్డి అప్పారావునాయుడు, డీఆర్‌డీఏ, మెప్మా, డ్వామా, ఐసీడీఎస్ పథక సంచాలకులు శచీదేవి, ఎన్.సరోజని, పూర్ణిమాదేవి, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 30 , 2025 | 12:15 AM