ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:12 PM
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ టీవీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... అనకాపల్లి పట్టణంలోని వేల్పులవీధి, పూడిమడకరోడ్డులో ఇటీవల రెండు ద్విచక్ర వాహనాలు చోరీ అయ్యాయి.
అనకాపల్లి టౌన్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ టీవీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... అనకాపల్లి పట్టణంలోని వేల్పులవీధి, పూడిమడకరోడ్డులో ఇటీవల రెండు ద్విచక్ర వాహనాలు చోరీ అయ్యాయి. పరవాడలో నివాసం ఉంటున్న చీడికాడ గ్రామానికి చెందిన మాకాల ధనుకుమార్ ఈ వాహనాలను చోరీ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు సోమవారం సాయంత్రం తుమ్మపాల సమీపంలోని ఏలేరు కాలువ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై పాత కేసులు వున్నాయని కేసు దర్యాప్తు చేస్తున్న పట్టణ ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరరావు తెలిపారు.
Updated Date - Jun 17 , 2025 | 11:12 PM