ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పక్కాగా భూముల రీసర్వే

ABN, Publish Date - Mar 15 , 2025 | 01:16 AM

భూముల రీసర్వేలో తప్పులు దొర్లకుండా చూడాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశాలు జారీచేసింది.

  • నాలుగు గ్రామీణ మండలాల్లో మరో 8 గ్రామాలు ఎంపిక

  • ఒక్కో గ్రామానికి ఆరేసి బృందాలు ఏర్పాటు

  • తప్పులు దొర్లకుండా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు

  • ఇప్పటికే మూడు గ్రామాల్లో రీసర్వే కొలిక్కి

విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):

భూముల రీసర్వేలో తప్పులు దొర్లకుండా చూడాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని మూడు గ్రామాల్లో చేపట్టిన రీసర్వే పనులు చివరి దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నాలుగు గ్రామీణ మండలాల్లోని మరో ఎనిమిది గ్రామాల్లో రీసర్వేకు తాజాగా నిర్ణయించారు. ఈనెల 20వ తేదీ నుంచి ఎనిమిది గ్రామాల్లో రీసర్వే పనులు ప్రారంభించనున్నారు.

పెందుర్తి మండలం పెదగాడి, పినగాడి, ఆనందపురం మండలం గిడిజాల, కుశలవాడ, భీమిలి మండలం తాటితూరు, తాళ్లవలస, పద్మనాభం మండలంలో పాండ్రంకితోపాటు మరో గ్రామాన్ని ఎంపిక చేశారు. ప్రతి గ్రామంలో భూముల రీసర్వేకు ఐదు బృందాలను, రైతులకు సమాచారం ఇవ్వడం, గ్రామ సభల నిర్వహణ, రైతులు, అధికారుల మధ్య సమన్వయం కోసం మరో బృందాన్ని నియమించారు. ప్రతి బృందంలో గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలు, ఇతర సిబ్బంది ఉంటారు. ప్రతి గ్రామంలో 250 ఎకరాలను ఒక బ్లాక్‌గా గుర్తిస్తారు. ఆ 250 ఎకరాలకు సంబంధించిన రైతులతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటుచేస్తారు. బ్లాక్‌ పరిధిలో ఏ సర్వే నంబర్‌లోని భూములు ఏ రోజు రీసర్వే చేస్తారనే వివరాలను గ్రూపులో పోస్టు చేస్తారు. ఇప్పటికే సర్వేయర్లు ప్రతి బ్లాకులో రైతుల వివరాలు, ఫోన్‌ నంబర్లు సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఎనిమిది గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్‌ సర్వే పూర్తిచేసిన సర్వే శాఖ రీసర్వేకు అంతా సిద్ధం చేసింది.

గొట్టిపల్లి, గంధవరం, దాకమర్రి గ్రామాల్లో కొన్ని వారాలుగా రీసర్వే జరుగుతోంది. జిల్లాలోని 85 రెవెన్యూ గ్రామాలకుగాను 59 గ్రామాల్లో గత ప్రభుత్వం హయాంలో రీసర్వే పూర్తిచేశారు. మిగిలిన గ్రామాల్లో రీసర్వే పనులు పక్కాగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా తప్పులు దొర్లకుండా సర్వేయర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సూచించారు.

Updated Date - Mar 15 , 2025 | 01:16 AM