ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చంద్రమౌళికి కన్నీటి వీడ్కోలు

ABN, Publish Date - Apr 26 , 2025 | 01:01 AM

పహల్గాం ఘటనలో మృతిచెందిన చంద్రమౌళి భౌతిక కాయానికి శుక్రవారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.

  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

  • హాజరైన మంత్రులు, నాయకులు

బీచ్‌ రోడ్డు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):

పహల్గాం ఘటనలో మృతిచెందిన చంద్రమౌళి భౌతిక కాయానికి శుక్రవారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. పాండురంగాపురం నుంచి పార్థివ దేహాన్ని ఊరేగింపుగా జ్ఞానాపురం శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ స్వయంగా పాడె మోశారు. అంత్యక్రియలకు ప్రజలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు తరలివచ్చారు. జోహార్‌ చంద్రమౌళి అని వీడ్కోలు పలికారు. అంతకుముందు చంద్రమౌళి భౌతికకాయం వద్ద హోం మంత్రి వంగలపూడి అనిత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, తదితరులు నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం అమానుష చర్య అన్నారు.

తల్లడిల్లిన కుటుంబసభ్యులు

చంద్రమౌళిని తలంచుకుంటూ భార్య నాగమణి, పిల్లలు నిహారిక, అనిమిత్ర భోరున విలపించారు. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

Updated Date - Apr 26 , 2025 | 01:01 AM