ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పక్కా స్కెచ్‌..!

ABN, Publish Date - Jun 23 , 2025 | 12:46 AM

ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది పక్కా స్కెచ్‌ వేశారు.

  • ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నాలు

  • ముందుగా చెట్లు కొట్టివేసిన అక్రమార్కులు

  • దృష్టిసారించని రెవెన్యూశాఖ అధికారులు

విశాఖపట్నం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది పక్కా స్కెచ్‌ వేశారు. ముందుగా ఆ ప్రాంతంలోని చెట్లను నరికివేసి, దర్జాగా తరలించేస్తున్నారు. అనంతరం భూమిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.

ఆనందపురం మండలం రామవరం సర్వేనంబరు 73లో సుమారు 23 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు అక్కమార్కులు స్కెచ్‌ వేశారు. వారి వెనుక కూటమిపార్టీ నేతలు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండతోనే ప్రభుత్వ భూమిలో ఏపుగా పెరిగిన చెట్లు నరికేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. గ్రామంలో ఎంఐజీ లేఅవుట్‌కు సేకరించిన భూమికి ఆనుకుని సర్వేనంబరు 73లో సుమారు 23 ఎకరాల గెడ్డపోరంబోకు ఉంది. నీరు ప్రవహించే ప్రాంతం కావడంతో సహజసిద్ధంగా మొలిచిన మొక్కలు ఏపుగా పెరిగాయి. రోడ్డుకు ఆనుకుని గెడ్డపోరంబోకు భూమి ఉండడంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చెట్లుకొట్టడం ప్రారంభించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమయింది. దీంతో మిగిలిన చెట్లు కొట్టడం నిలిపివేశారు. అప్పటికే కొట్టిన చెట్లను వ్యాన్లలో ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రభుత్వ భూమిని కబ్జాచేయాలని కొందరు స్కెచ్‌ వేశారనే ఆరోపణలున్నాయి. మొత్తం 23ఎకరాల్లో 15 ఎకరాల వరకు ఒకే బిట్‌గా ఉండడంతో దానిపై కబ్జాదారుల కన్నుపడింది. ఎలాగైనా దానిని కొట్టేయాలనే ఆలోచనతో తొలుత కొన్ని చెట్లు నరికేశారు. కొద్దిరోజుల తరువాత మిగిలిన చెట్లు నరికేసి రికార్డులు మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. వారి వెనుక కొంతమంది కూటమి పార్టీ నాయకులుండడంతో రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోయారని అంటున్నారు. చివరకు చెట్లు నరికిన వ్యక్తులపై చర్యలకు కూడా వెనుకంజవేస్తున్నారని, ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటుచేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు.

Updated Date - Jun 23 , 2025 | 12:46 AM