ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యానవనమా.. డంపింగ్‌ యార్డా?

ABN, Publish Date - Jun 10 , 2025 | 12:48 AM

మండల కేంద్రం పరవాడ దుర్గమాంబ ఆలయం వెనుక ఏర్పాటు చేసిన లుపిన్‌ పార్కు అధ్వానంగా తయారైంది. ఆహ్లాదాన్ని పంచాల్సిన ఈ పార్కు ఆకతాయిలకు అడ్డాగా మారింది. నిర్వహణ లేక తుప్పలు పెరిగిపోవడంతో రాత్రయితే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

పార్కులో తుప్పు పట్టిన ఆట పరికరాలు

అధ్వానంగా లుపిన్‌ పార్కు

పిచ్చిమొక్కలు, వ్యర్థాలతో నిండిపోయిన వైనం

తుప్పు పట్టిన ఆట పరికరాలు, బెంచీలు

ఆహ్లాదాన్ని కోల్పోయిన పిల్లలు, వృద్ధులు

రాత్రయితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

పట్టించుకోని పంచాయతీ అధికారులు

పరవాడ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రం పరవాడ దుర్గమాంబ ఆలయం వెనుక ఏర్పాటు చేసిన లుపిన్‌ పార్కు అధ్వానంగా తయారైంది. ఆహ్లాదాన్ని పంచాల్సిన ఈ పార్కు ఆకతాయిలకు అడ్డాగా మారింది. నిర్వహణ లేక తుప్పలు పెరిగిపోవడంతో రాత్రయితే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పరవాడ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు లుపిన్‌ ఫౌండేషన్‌ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా 2019లో సుమారు 70 సెంట్ల స్థలంలో ఉద్యానవనం ఏర్పాటు చేసింది. వాకింగ్‌ ట్రాక్‌, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆట పరికరాలు, కూర్చునేందుకు బెంచీలు, వాలీబాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టులు, ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యానికి బోరు కూడా తవ్వించారు. నీటి సౌకర్యం పుష్కలంగా ఉండడంతో వివిధ రకాల మొక్కలను నాటి పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు. కొంత కాలం తరువాత పార్కు నిర్వహణ బాధ్యతను పంచాయతీకి అప్పగించారు. కొంతకాలం పాటు నిర్వహణ బాగానే చేపట్టారు. రాను రాను నిర్వహణ బాధ్యతను గాలికొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. పార్కు ప్రాంగణమంతా పిచ్చిమొక్కలతో నిండిపోయింది. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట పరికరాలతో పాటు ఇనుప బెంచీలు తుప్పు పట్టి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ఎల్‌ఈడీ దీపాలు కనుమరుగుకాగా, కొన్ని దీపాల చుట్టూ తీగ లు అల్లుకుని కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పార్కు కళావిహీనంగా మారింది. నడకమార్గం అధ్వానంగా తయారైంది. రాత్రుల సమయంలో మందుబాబులు పార్కును బార్‌లా వినియోగించుకుంటున్నారు. పంచాయతీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పార్కు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో వారి తీరు పట్ల స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలుగజేసుకొని పార్కును వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని పరవాడ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:48 AM