ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం

ABN, Publish Date - Jul 25 , 2025 | 10:42 PM

మండలంలోని ముల్లుమెట్ట గ్రామంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఇద్దరు గిరిజన యువకుల మృతి

ఒకరికి తీవ్ర గాయాలు

గూడెంకొత్తవీధి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ముల్లుమెట్ట గ్రామంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ రాసపనస గ్రామానికి చెందిన కిల్లో వీర(26), గూడెంకొత్తవీధి మండలం వంచుల పంచాయతీ మురగడపల్లి గ్రామానికి చెందిన పాంగి మహేశ్‌, పాంగి నితిన్‌(20)లు ఒక ద్విచక్రవాహనంలో మురగడపల్లి గ్రామానికి ప్రయాణమయ్యారు. ముల్లుమెట్ట గ్రామంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. వాహనం నడుపుతున్న కిల్లో వీర సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మహేశ్‌, నితిన్‌లను 108లో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి కేజీహెచ్‌కి తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ నితిన్‌ మృతి చెందాడు. మహేశ్‌ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

Updated Date - Jul 25 , 2025 | 10:42 PM