జిల్లాలో 85.47 శాతం పెన్షన్ల పంపిణీ
ABN, Publish Date - Aug 01 , 2025 | 10:45 PM
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా తొలి రోజు శుక్రవారం 85.47 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించారు.
మొత్తం 1,23,046 మందికిగానూ 1,05,171 మందికి అందజేత
మిగిలిన వారికి నేడు పింఛన్లు
మినుములూరులో జేసీ పంపిణీ
పాడేరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా తొలి రోజు శుక్రవారం 85.47 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో 1,23,046 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.51 కోట్ల 78 లక్షల 50 వేలు విడుదల కాగా.. తొలి రోజు శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి 1,05,171 మందికి రూ.44 కోట్ల 19 లక్షల 51 వేల పెన్షన్ల సొమ్మును పంపిణీ చేశారు. ఇంకా 17,875 మందికి పెన్షన్ అందించాల్సి ఉంది. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 85.47 శాతంగా నమోదైంది. అలాగే తొలి రోజు పెన్షన్ పొందని లబ్ధిదారులకు శనివారం అందజేస్తామని అధికారులు తెలిపారు.
మినుములూరులో జేసీ పెన్షన్ పంపిణీ
పాడేరు మండలం మినుములూరు గ్రామంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ వృద్ధురాలికి పెన్షన్ సొమ్ము అందించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మండలంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, ఎంపీపీ ఎస్.రత్నకుమారి, సర్పంచ్ లంకెల చిట్టమ్మ, సచివాలయ కార్యదర్శి అనుషా, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 10:45 PM