ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

700 కిలోల రేషన్‌ బియ్యం సీజ్‌

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:27 AM

మండలంలోని గొలుగొండపేట నుంచి ఆటోలో తరలిస్తున్న 700 కిలోల రేషన్‌ బియ్యాన్ని గ్రామస్థులు సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. అనంతరం పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌ (సీఎస్‌డీటీ) కుమార్‌కు సమాచారం ఇచ్చారు.

ఆటోలో తరలిస్తుండగా గొలుగొండపేట గ్రామస్థులు పట్టుకున్న రేషన్‌ బియ్యం

ఆటోలో తరలిస్తుండగా పట్టుకొన్న గొలుగొండపేట గ్రామస్థులు

నాతవరం. జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొలుగొండపేట నుంచి ఆటోలో తరలిస్తున్న 700 కిలోల రేషన్‌ బియ్యాన్ని గ్రామస్థులు సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. అనంతరం పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌ (సీఎస్‌డీటీ) కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి 14 బస్తాల్లో ప్యాకింగ్‌ చేసిన రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. ఆటో డ్రైవర్‌ గోపీని విచారించగా, కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడికి చెందిన అయినవిల్లి రాజు అనే వ్యక్తి కిరాయికి రమ్మంటే ఆటో తీసుకువచ్చినట్టు చెప్పాడు. రేషన్‌ కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి ఆటోలో తరలిస్తున్నట్టు నిర్ధారించామని సీఎస్‌ డీటీ చెప్పారు.

Updated Date - Jun 03 , 2025 | 12:28 AM