560 కిలోల గంజాయి స్వాధీనం
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:44 AM
ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 560 కిలోల గంజాయిని మంగళవారం స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశామని స్థానిక ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
- ఒకరి అరెస్టు
- రెండు కార్లు సీజ్
- పరారీలో నలుగురు
పెదబయలు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 560 కిలోల గంజాయిని మంగళవారం స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశామని స్థానిక ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని కేజీబీవీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఆ సమయంలో నకిలీ నంబర్ ప్లేట్లతో రెండు కార్లు పాడేరు వైపు వెళుతున్నాయి. పోలీసులు వాటిని ఆపే ప్రయత్నం చేయగా అందులోంచి నలుగురు వ్యక్తులు పారిపోగా, ఒకరు మాత్రం పట్టుబడ్డారు. ఆ రెండు కార్లను తనిఖీ చేయగా 560 కిలోల గంజాయి లభ్యమైంది. పట్టుబడిన వ్యక్తి డుంబ్రిగుడ మండలం పొతులంగి పంచాయతీ కొసంగి గ్రామానికి చెందిన వంతాల దానేశ్‌గా గుర్తించారు. అతనిని అరెస్టు చేసి విచారించగా ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్ర సోలాపూర్‌కు తరలిస్తున్నట్టు చెప్పాడు. పరారైన వారిలో ఇద్దరు డుంబ్రిగుడకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారని ఎస్‌ఐ తెలిపారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 12:44 AM