400 కిలోల గంజాయి స్వాధీనం
ABN, Publish Date - May 21 , 2025 | 11:38 PM
ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 400 కిలోల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశామని పెదబయలు ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపారు.
ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టివేత
ఇద్దరి అరెస్టు
పెదబయలు, మే 21 (ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 400 కిలోల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశామని పెదబయలు ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు బుధవారం పెదబయలు మోదకొండమ్మ అమ్మవారి ఆలయం వద్ద వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఆ సమయంలో కుజబంగి మీదుగా పాడేరు వైపు వెళుతున్న కారును ఆపారు. అయితే డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా అతనితో పాటు కారులో ఉన్న మరో వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా బస్తాల్లో 400 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మండవి గ్రామానికి చెందిన అక్షయ్ శివాజీ పిషేగా, మరొకరు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ ముక్కిపుట్టు గ్రామానికి చెందిన మల్జంగి రామలింగంగా గుర్తించారు. వారిద్దర్నీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Updated Date - May 21 , 2025 | 11:38 PM